అలాంటి సిత్రాలు’ ట్రైలర్ ఇదిగో!

       టాలీవుడ్ ఓ న్యూ ఏజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.ఓటీటీ వల్ల ఆఫ్ బీట్ సినిమాలు తీసే స్వాతంత్ర్యం లభిస్తోంది. తాజాగా ఈ లిస్టులో ‘అలాంటి సిత్రాలు’ చేరింది. శ్వేతా పరాశర్, ప్రవీణ్ యండమూరి, యశ్ పూరి, తన్వీ ఆకాంక్ష, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ ని ఈ రోకు రిలీజ్ చేశారు.

        ట్రైలర్ లో ఒక యువకుడు  ఒక వృద్ధ మహిళని తో అనుసరిస్తాడు. ఆమె వేశ్య. అయినా  ఆ యువకుడు ఆగడు. కేవలం ఐదు నిమిషాలు తనతో గడపమని ఆమెని అడుగుతాడు. ఆ వృద్ధురాలు వృత్తి రీత్యా తానెంత కష్ట కాలంలో వున్నా అతడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవించమని ఉపదేశిస్తుంది.

        మరోవైపు బాధ్యతా రహితమైన ఒక తండ్రిని మనం చూస్తాం. జూదమాడడం, డబ్బు పోగొట్టుకోవడం, అప్పుల్లో చిక్కుకోవడం అతడి  దినచర్యలో భాగంగా వుంటుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న మరో యువకుడు బాక్సింగ్ నేర్చుకుంటూ వుండే పరిస్థితి ఇంకోవైపు.

        ఈ సంబంధిత పరిస్థితులతో ఈ నాలుగు జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది  ‘అలాంటి సిత్రాలు’ కాన్సెప్ట్ గా కనిపిస్తోంది. దీనికి సుప్రీత్ సి.  కృష్ణ రచన,  దర్శకత్వం వహించాడు. కె.రాఘవేందర్ రెడ్డి సమర్పణలో  దర్శకుడు సుప్రీత్, రాహుల్రెడ్డి, శ్రీవరుణ్ నిర్మాతలు. ఓంకార్ సంగీతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *