‘అరణ్య’ హిందీకి మళ్ళీ కోవిడ్ దెబ్బ!


దగ్గుబాటి రానా న‌టించిన పాన్ ఇండియా మూవీ  `అర‌ణ్య‌` విడుదల ఈ శుక్రవారం ఖరారయింది. అయితే తెలుగు తమిళ హిందీ భాషల్లో నిర్మించిన ‘అరణ్య’ హిందీ వెర్షన్ `హాథీ మేరే సాథీ` విడుదలకి బ్రేకు పడింది. కోవిడ్ దెబ్బతో విడుదల వాయిదా పడింది. అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న సమస్య మీద నిర్మించిన ఈ మూవీ విడుదల గత సంవత్సరం నుంచీ సమస్యగానే వుంది. నిజానికి ఏప్రెల్ 2, 2020 న మూడు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల కావాల్సి వుండగా, కోవిడ్ లాక్ డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు నిర్మాతలు. తీరా ఇంత కాలం ఆగి ఈ శుక్రవారం విడుదల ప్రకటిస్తే, సేమ్ సీన్ ఎదురయింది కోవిడ్ పునర్ విజృంభణతో.

నార్త్ లో కోవిడ్ కేసులు పెరిగాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా చాలా ప్రాంతాల్లో థియేట‌ర్లు తెర‌చుకోలేదు. నైట్ కర్ఫ్యూ కూడా క‌ఠినంగా అమ‌లు అవుతోంది. ఈ నేప‌థ్యంలో అనేక  బాలీవుడ్ సినిమాల విడుద‌ల‌లు వాయిదా వేసుకున్నారు.. `హాథీ మేరే సాథీ` కూడా వాయిదా వేశారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాకే విడుదల నిర్ణయం తీసుకుంటారు.
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా, విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావ్కర్ మొదలైన వారు ఈ త్రి భాషా చిత్రంలో నటించారు. 2017 నుంచీ దీని నిర్మాణ కార్యక్రమాలు సాగాయి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *