తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూసివేసే అవకాశం ఉందని తెలిసింది. కోవిడ్ విపరీతం గా పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్త గా చర్యగా రాష్ట్రంలో విద్యా సంస్థలన్నంటిని నిరవధికంగా మూసేసిన సంగతి తెలిసిందే. ఇపుడు సినిమా హాళ్లను మూసేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలినలో ఉన్నట్లు తెలిసింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచే ఈ ప్రతిపాదన వెళ్లినట్లు సమాచారం. కరోనా వ్యాప్తినివారణ లో ఆలస్యం జరగరాదని, ప్రభుత్వం అలసత్వం వహిస్తే మరింత ముప్పు తప్పదంటూ ఆరోగ్య శాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది. థియేటర్ల పూర్తి మూసివేత సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయంగా కరోనా ప్రొటోకోల్ పాటిస్తూ నిర్వహించడం సాధ్యమా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తర్వాత బార్లు రెస్టరెంట్ల మీద కూడా ఆంక్షలువిధించే వీలుందని కూడా చెబుతున్నారు.