తూ.గో జిల్లాలో కోరనా కలకలం, వణికి పోతున్న తల్లితండ్రులు

తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ కలకలం సృష్టిస్తున్నది.  రంపచోడవరంలోని ఒక ప్రయివేటు సంస్థలో పెద్ద ఎత్తున కేసులు బయటపడటం, సంస్థని కంటైన్ మెంట్ జోన్ ప్రకటించడంతో  తల్లితండ్రులు ఆందోళన గురవుతున్నారు. కొందరు తల్లితండ్రులు కాలేజీ దగ్గిరకు వచ్చి తమ పిల్లలను ఇంటికి పంపిచాలని, తాము హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతామని ప్రాదేయపడ్తున్నారు. అయితే, పాజిటివ్ కేసులను ఇలా ఇళ్లకు పంపడం సాధ్యం కాదు కాబట్టి, అధికారులు దీనికి సమ్మతించడం లేదు.

గత కొద్ది రోజులుగా నెమ్మెదిగా కనిపిస్తున్న కరోనా కేసులే నిన్న ఒక్క సారి గుప్పున తారాస్థాయికి చేరుకున్నాయి. చిత్రమేమిటంగే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారంతా విద్యార్థులే. ఈ సారి కరోనా వేవ్ విద్యాసంస్థలను చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో చాలా విద్యాసంస్థలు, ముఖ్యంగా హాస్టళ్లు కరోనా బారిన పడి కరోనా క్లస్టర్లుగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి ఇపుడు తూర్పుగోదావరి జిల్లాలో ఎదురవుతున్నది.

నిన్న జిల్లాలో ప్రవేయిటు, ప్రభుత్వ కాలేజీలలో కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా  కేసులు కేవలం వెల్ఫేర్ హాస్టళ్లకే కాదు, ప్రయివేటు కాలేజీలలో కూడా పెరుగుతున్నాయి.  రంపచోడవరంలో ప్రయివేటు జూనియర్  కాలేజీలో ఇపుడు పెద్ద చర్చనీయాంశమయింది. ప్రయివేటు కాలేజీలు కూడా కోవిడ్ నియమాలను పాటించడం లేదని తెలిసింది. ఈ కాలేజీలో  ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ కేసులు కనిపించాయి.  ఇందులో ఒక్క సోమవారం నాడు 141కేసులు బయటపడ్డాయి.

ఈ విషయం బయటకు పొక్కగానే తల్లితండ్రులు చాలా మంది హుటాహుటిని స్కూల్ దగ్గరకు వచ్చి తమ పిల్లలను ఇంటికి పంపాలని, ఇంటిదగ్గిరే తాము ఐసోలేషన్ తో ఉంచుతామని స్కూలు మీద, అధికారుల మీద వత్తిడి తీసుకువచ్చారు. దీనికి అధికారులు సమ్మతించలేదు. తల్లితండ్రులు బలవంతంగాపిల్లలను ఇంటికి తీసుకుపోయే ప్రమాదం ఉన్నందున స్కూలువద్దే బందోబస్తు పెంచారు.

ప్రయివేటు స్కూళ్లలో కోవిడ్ పరీక్షలను పెద్దఎత్తున చేస్తున్నారు.  ఈ నెల 16 నుంచి   21 వరకు సుమారు     రాజమండ్రి డివిజన్ లో  2196 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 23పాజిటివ్ కేసులు కనిపించాయి. అయితే, నిన్న ఒక్కరోజే  141 కేసులుకనిపించాయి.

నిన్నరంపచోడవరానికి విద్యాసంస్థలో 800 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించినట్లు డిఎం అండ్ హెచ్ వొ డా. గౌరీశ్వరరావు తెలిపారు.

వీరిలో 163 మంది కోరోనా పాజిటివ్ అని తెేలగానే  పాజిటివ్ విద్యార్థులందరిని ఒక ప్రత్యేకబ్లాక్ క తరలించారు. పాఠశాల పరిసరాలను శానిటైజ్ చేశారు. ఈ స్కూల్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

ఇద్దరు మెడికల్ సూపర్ వైజర్లను అక్కడ నియమించి పర్యవేక్షిస్తున్నారు.అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు 108 అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు.

అయితే, అనవరందా ఆందోళన చెందనవసరం లేదని, విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించి, భౌతికదూరంపాటించేలా జాగ్రత్త తీసుకుంటే కరోనా వ్యప్తి నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *