హైదరాబాద్ లో ‘జనతా కర్ఫ్యూ’ : ఏడాది కిందట ఇదే రోజున

సరిగ్గా ఏడాది కిందట అంటే 2020 మార్చి 22 హైదరాబాద్ ఇలా ఉండింది, నిర్మానుష్యంగా.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ లు ఇచ్చిన పిలుపుతో కరోన  వైరస్ వ్యాప్తి నివారించేందుకు హైదరాబాద్ లో 24 గంటల జనతా కర్ఫ్యూ పాటించారు. వైరస్ భయంతో  ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దుకాణాలు బంద్. ట్రాఫిక్ బంద్. జనసంచారం బంద్. జనతా బంద్  విజయవంతంగా సాగింది.
ఒక్క మనిషీ రోడ్డెక్కలేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అక్కడక్కడా పోలీసులు మాత్రం కనిపించారు. ఎవరైనా బంద్ ఆంక్షలను ఉల్లంఘించి బయటకు వస్తే వెనక్కి పంపించారు. నాటి జ్ఞాపకాలివే…

పరిస్థితులు జనత కర్ప్యూదాకా వస్తాయో రాదో చెప్పలేం కాని, ఏడాది తర్వాత ఇపుడు మళ్లీ కరోన వైరస్ వ్యాపిస్తూ ఉంది. కొందరేమో ఇది సెకండ్ వేవ్ అంటున్నారు. శాస్త్రవేత్తలేమో సెకండ్ వేవ్ లా కనిపిస్తూ ఉన్నా అలా అనడానికి వీల్లేదని చెబుతున్నారు. ఈ మహారాష్ట్ర, పంజాబ్ లలో ఉధృతంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర రోజూ 60 వేల దాకా కొత్త కేసులు వస్తున్నాయి. మహారాష్ట్ర దేశంలో చాలా ముఖ్యమయిన రాష్ట్రం. అందువల్ల ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కరోనా పాకుతుందేమేననే భయం సర్వత్రా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో… తెలంగాణలో…

ఇక పోతే తెలంగాణలో మళ్లీ కేసులు బాగా పెరుగుతున్నాయి.గత ఏడాది అక్టోబర్ లో తెలంగాణలో కరోనకేసులు శిఖరాగ్రా (peak)నికి చేరాయి.
నవంబర్ నుంచి కేసులు సంఖ్య పడిపోవడం మొదలయింది. ఆ నెలలో కేసులు 1400 నుంచి 2000 దాకా రోజూ కనిపించేవి. నవంబర్ నెలాఖరుకు
ఇవి వేయికి పడిపోయాయి. 2021 జనవరి మూడోవారం నాటికి ఇవి రోజుకు200 కేసుల స్థాయికి పడిపోయాయి.ఈ పరిస్థితి మార్చి దాకా
కొనసాగింది. అయితే, మార్చి నుంచి కొత్త కేసులు కనిపించడం ఎక్కువయింది. మార్చి మొదటి వారంలో రోజూ సుమారు 170 కరోనా కేసులు
కనిపించాయి. అప్పటినుంచి పెరగడం మొదలయింది. మార్చి 9న 189 కేసులు కనబడితే, మార్చి 10న 194కేసులు కనిపించాయి. మార్చి
16 నుంచి కేసులు ఇంకా పెరగడం మొదలయిందని ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న కోవిడ్ బులెటీన్ సమాచారం చెబుతుంది.
విశేషమేమిటంటే పలుచోట్ల కోవిడ్ క్లస్టర్స్ బయటపడుతున్నాయి. ఇవన్నీ దాదాపు విద్యాసంస్థలు, హస్టళ్లే. మొదట మంచిర్యాల్ జిల్లా
పరిషత్ హైస్కూళ్లో బయటపడింది. అక్కడ మొదట ఒక టీచర్ కు సోకింది. తర్వాత 55మంది విద్యార్థులను పరీక్షిస్తే 12 మంది కోవిడ్ పాజిటివ్ అని
తేలింది.తర్వాత ఈ క్లసర్ సైజ్ 50 కిపెరిగింది. ఇందులో అరుగురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఉన్నారు. మార్చి 16న హైదరాబాద్ నాగోల్
లోని మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్ లో మరొక క్లస్టర్ బయటపడింది. ఇక్కడ 34 కేసులును అధికారులు గుర్తించారు. ఆపైన కామారెడ్డి జిల్లా
టేక్రియాల్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం 32 కరోనా కేసులను గుర్తించారు. తర్వాత రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని
ఎస్ టి బాలుర హాస్టల్ 22 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న భైంసాతో పాటుహదరాబాద్ పాతబస్తీ పాఠశాలలో కూడాయకరోనా
పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ లో

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిశబ్దంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చిందని, ఇంకేమీ కాదని ప్రజలంతా తీసుకోవలసిన జాగ్రత్తతను గాలికి వదిలేయడంతో, దీమా గా తిరుగుతూ ఉండటంతో గత    3 నెలల నుంచి మెల్లిమెల్లిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇపుడు ఒకే రోజు మార్చి20న  380  కేసులు నమోదు అయ్యాయి. దాదాపు జీరోకు వచ్చిన కరోనా కేసులు ఇపుడు మూడు వందల స్థాయికి రావడం ఆందోళన కలిగించే విషయమే.

జిల్లాల వారీగా కేసుల పెరుగుదల ఇలా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా  70 పాజిటివ్ కేసులు  గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. తర్వాతి స్థానం  60 కేసులతో చిత్తూరు జిల్లాది. కర్నూలు జిల్లా 51 కేసులతో మూడో స్థానంలో ఉంది. విశాఖపట్నం  జిల్లాలో 43 కేసులునమోదయ్యాయ. ఇక జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో 26 కేసులు, రికార్డయితే, అనంతపురం జిల్లాలో  22 కేసులు, కడప 8 కేసులు, కృష్ణా లో 44 కేసులు,
నెల్లూరు జిల్లాలో 21 కేసులు, ప్రకాశం జిల్లాలో 6 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులు, విజయనగరం జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కేసులు  నమోదు అయ్యాయి..

కోవిడ్ కారణంగా నిన్న కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *