సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యోగులంతా పండగ చేసుకుని పాలభిషేకాలు చేసే వార్త చెప్పారు. రాష్ట్రంలో ఉధ్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 58నుంచి 61 కి పెంపుతూ ప్రకటన చేశారు. ఉద్యోగులందరిని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా ల పీఆర్పీ ఫిట్ మెంట్ 30శాతం ప్రకటించారు. ఇవితక్షణ అమలులోకి వస్తాయి.
ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా చెప్పారు.
“2018 అసెంబ్లీ ఎన్నికలపుడు టిఆర్ ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.”
ప్రకటనలో తెలంగాణ ఎన్జీవోలలో సంబరాలు మొదలయ్యాయి.
ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే...
* ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీ.ఆర్.ఏలు, వీ.ఏ.ఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్కు చార్జ్ డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
* ఇప్పటివరకు రాష్ట్రంలో 80శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతోపాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది.
* ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది.
* ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
* ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) కు ఉన్న వయో పరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
* కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* పి.ఆర్.సి.కి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోపాటు, కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది.
* ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్
* ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి.