తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం కనిపిస్తూ ఉంది. షెడ్యూల్ కంటే ముందే సభ ను ముగించేందుకు ప్రభుత్వం యోచిస్తూ ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. సాయంకాలం లోపు ప్రకనట వెలువడవచ్చని తెలిసింది.
ప్రశ్నోత్తరాల సమయం తరవాత అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ప్యాకేజీ రూపంలో తీపి కబురని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటిస్తారు. దీని తర్వాత కరోనా మీద నిర్ణయం ఉండవచ్చని తెలిసింది.
ఉద్యోగులకోసం ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ముఖ్యం అని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రకటనలో…
-29% ఫిట్మెంట్!
-61 ఏళ్ల పదవీకాలం!
-సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్!
-తక్షణమే (ఈనెల నుంచే) పీఆర్సీ అమలు!
-పీఆర్సీ రిపోర్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2018 1st జులై!
-మార్చి 2020 వరకు నోషనల్ ఫిక్సేషన్
-1st ఏప్రిల్ నుంచి ఏరియర్స్!
-రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే 15% క్వాన్టం ఆఫ్ పెన్షన్ గరిష్ట వయోపరిమితి 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదింపు!
తదితర అంశాలుంటాయని విశ్వసనీయ సమాచారం.