23న మధ్యప్రదేశ్ లో మోగనున్న కోవిడ్ సైరెన్ : హై ఎలెర్ట్

మధ్యప్రదేశ్ లో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేఫథ్యం ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్  ప్రభుత్వం నివారణకు కొత్త క్యాంపెయిన్  మొదలు పెట్టింది. ఇది మార్చి 23న ప్రారంభమవుతుంది.

ఆ రోజు రాష్ట్రమంతా కోవిడ్ సైరెన్ రెండుసార్లు మోగిస్తారు. మొదటిసారి ఉదయం పదకొండగంటలకు, రెండో సారి సాయంకాలం  ఏడు గంటలకు మోగిస్తారు.

ప్రతిసారి రెండు నిమిషాల పాటు సైరెన్ మోగిస్తారు. ఈ సైరెన్ మోగగానే రాష్ట్ర ప్రజలంతా  కోవిడ్ ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికాకుండా ఉండేందుకు ‘నేను మాస్క్ తప్పక ధరిస్తాను, భౌతిక దూరం పాటిస్తాను,’ అని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు.

అంతేకాదు, బజార్లలో షాపుల యజమానులు బయట భౌతిక దూరానికి అవసరమయిన వృత్తాలు గీయాల్సి ఉంటుంది. తాను కూడా ఈ పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నందున ఆదివారం నాడు  భోపాల్, ఇండోర్, జబల్ పూర్ జిల్లాలో  లాక్ డౌన్ విధించారు.  విద్యాసంస్థలను మార్చి 31 దాకా మూసేశారు. మధ్యప్రదేశ్ లోని అనేక ఇతర జిల్లాల్లో కూడా కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ఉంది. లాక్ డౌన్ విధించి ఆర్థికంగా నష్టపోవడం నాకు ఇష్టం లేదు అయితే,  ఉధృతంగా పెరుగుతున్న కరోనా ఆందోళన కల్గిస్తున్నది,’ అని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *