తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా టిడిపి జెసి ప్రభాకర్ రెడ్డి ఎన్నిక

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికైనారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చిన రెండు మునిసిపాలిటీలలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒకటి, రెండోది కడప జిల్లాలోకి మైదుకూరు. ఇక్కడ ఎన్నికల్లో వైసిపి ఉధృతిని అంతేబలంగా ఎదుర్కొని జెసి బద్రర్స్ తాడిపత్రిని తమఅదుపులోకి తెచ్చుకున్నారు. వైసిపి స్టైల్ ఎన్నికల రాష్ట్రమంతా విజయవంతమయినా ఇక్కడ కాలేదు. అంటే బలమయిన వ్యక్తి ఎదుర్కంటే వైసిపి ని వోడించవచ్చని జెపి ప్రభాకర్ రెడ్డిా రుజువు చేశారు. అయితే, ఈ ప్రయోగం రాష్ట్రమంతా చేయటం టిడిపికి సాధ్యం కాదు.

ఇక పోతే మునిసిపల్ వైస్ చైర్మన్ గా టిడిపికే   చెందిన సరస్వతి ఎన్నికయింది.

వైసిపిలో పట్టులోకి కౌన్సిలర్లు ఎవరూ వెళ్లకుండా జెసి చాలా కట్టుదిట్టంగా వ్యవహరించారు.కౌన్సిలర్లెవరూ వైసిపి ఎన్నికల మేనేజర్లకు అందుబాటులో లేకుండా క్యాంప్ లో పెట్టి కాపాడుకున్నారు.

టిడిపి  మునిసిపాలిటి ని కాపాడుకోగలుగుతుందా అనే  ఉత్కంఠ మధ్య ఈ రోజు ఎన్నిక జరిగింది.  టిడిపి మద్దతు తో గెలిచిన ఇండిపెండెంట్ కౌన్సిలర్, సిపిఐ కౌన్సిలర్  చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో రెండు పదవులు తెలుగుదేశం చేజిక్కించుకుంది.

గతంలో కూడా ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. అపుడు తాడిపత్రిని శుభ్రతలో నెంబర్ వన్ చేశారు. ఈ విషయంలో తాడిపత్రి మునిసిపాలిటీకి జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు.  మళ్లీ తాడిపత్రి మునిసిపాలిటీకి మంచిరోజులు వచ్చినట్లే.

ఎన్నిక అనంతరం విలేకరులకు రెండో తరం  జేసీ బ్రదర్స్ పవన్ రెడ్డి, జెసి అశ్విత్ రెడ్డి విక్టరీ గుర్తు చూపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *