సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ పంజాబ్ వారు ‘2020 జాతీయ విద్యావిధానం’ తెలుగు ప్రతిని విడుదల చేసారు.
ఎంతో వివాదాస్పదం, చర్చనీయాంశం, అంతా చదవి చర్చించాల్సిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకు అందించాల్సిన బాధత్య తెలుగు ప్రభుత్వాలమీద, విశ్వవిద్యాలయాల మీద, ఇక్కడి తెలుగు అకాడెమీల మీద ఉంది. కాని ఆపని వారెవరూ చేయలేదు.
ఎక్కడో ఉన్న పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ ఈ పని చేసింది.
జాతీయ విద్యావిధానం, 2020 ని సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ పంజాబ్ బథిండా(CUPB), విద్యా భారతి ఉచ్ఛ శిక్ష సంస్థాన్ సహకారంతో, తెలుగు ప్రతిని విడుదల చేసి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది.
జాతీయ విద్యావిధానం, 2020 తెలుగు ప్రతులను తీసుకురావడంలో చేసిన కృషికి గాను సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ పంజాబ్ వైస్ చాన్సలర్ ప్రొ రాఘవేంద్ర పి తివారి ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు.
దీనిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో అందించారని వైస్ చాన్సలర్ ని అభినందించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఉపన్యాసకులుగా ప్రొ. అప్పారావు పొదిలి(వైస్ చాన్సలర్. యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్), ప్రొ. టి.వి. కట్టిమని(వైస్ చాన్సలర్, ఆంధ్ర ప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, మరియు సభ్యులు, జాతీయ విద్యావిధానం, 2020) మరియు కె . ఎస్. రఘునందన్(విధ్యా భారతి ఉచ్చ శిక్ష సంస్థాన్) హాజరయ్యారు.
వైస్ చాన్సలర్ ప్రొ. తివారి అధ్యక్ష ఉపన్యాసంచేస్తూ సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ పంజాబీ కి జాతీయ విద్యా విధానం 2020 ని భారతీయ బాషలలో ప్రచురించడానికి రమేష్ పొక్రియల్ ‘నిషాంక్’ నుంచి ప్రోత్సాహం లభిచిందని కృతజ్ఞతలు తెలిపారు.
దీనికి CUPB అధ్యాపక బృందం విద్యార్థులు ఈ అనువాద కార్యక్రమాన్ని సఫలం చేయడానికి చాలా కష్టపడ్డారని, త్వరలోనే జాతీయ విద్యా విధానం, 2020 ని ఒడియా విడుదల చేస్తమని ప్రకటించారు.
అదే విధంగా ఇతర భారతీయ బాషలలో కూడా జాతీయవిద్యావిధానాన్ని ప్రచురిస్తామని కూడా ప్రొ. తివారీ తెలిపారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ 2020-జాతీయ విద్యావిధానంమొదటి తెలుగు ప్రతిని సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ పంజాబ్ లో చదువుతున్న ఒక తెలుగు విద్యార్థికి అందుకున్నారు.