చంద్రబాబునాయుడుకు సీఐడీ నోటీసు కక్ష సాధింపు కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
‘21 నెలల పాలనలో ఏనాడూ ఎవరిపైనా ముఖ్యమంత్రి జగన్ అలా వ్యవహరించలేదు.అమరావతిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములు లాక్కున్నారు. వారిని అప్పటి అధికార పార్టీ నేతలు ప్రలోభ పెట్టారు. బెదిరించారు. అందుకే కేసు నమోదు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది,’ అని అన్నారు. ఆయన ఈరోజు తిరుపతి వైసిపి లోెక్ సభ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని మీడియాకు పరిచయడం చేస్తూ ప్రసగించారు.
సజ్జల ఇంకా ఏమన్నారంటే…
చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించాలి
కానీ నోటీసు ఇవ్వగానే నానా యాగీ చేస్తున్నారు. విమర్శిస్తున్నారు
గతంలో వారే చెప్పారు.. తాము తప్పు చేసి ఉంటే తేల్చమన్నారు
ఇప్పుడు దర్యాప్తులో భాగంగా నోటీసు ఇవ్వగానే తప్పు పడుతున్నారు
చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాని కోసం ఇంతగా మాట్లాడాల్సిన పని లేదు విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు బలవంతంగా లాక్కున్నారు. వారు తప్పు చేశారు. అది వారికి కూడా తెలుసు. అందుకే ఈ విమర్శలు. ఇంక లోకేష్ విమర్శలకు అంతూ పొంతూ ఉండడం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.
నిజంగా చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సహకరించాలి. దర్యాప్తులో అన్నీ తేలుతాయి కదా?. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాని కోసం ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. విమర్శలు చేయాల్సిన అవసరం కూడా లేదు.
అవి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు కాబట్టి, అందులో ప్రాధమిక ఆధారాలు కూడా లభించాయి కాబట్టి, ఆ సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏ మాత్రం కక్ష సా«ధింపు కాదు. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో భాగంగా, అసైన్డ్ భూములు ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతంగా నాడు అధికార పార్టీ నాయకులు తీసుకున్నారు. ప్రభుత్వం నేరుగా ఆ భూములు తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం కావాలంటే నోటిఫికేషన్ ఇచ్చి వాటిని తీసుకోవచ్చు. కానీ అక్కడ అలా జరగలేదు. ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వడం కోసం అధికార పార్టీ నేతలు బలవంతంగా అసైన్డ్ భూములు తీసుకున్నారు.