తెలంగాణ తొలినాళ్ల కమ్యూనిస్టు జీవిత చరిత్ర ఆవిష్కరణ

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)

ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టారు. ఉమ్మడి కుటుంబ భూమి 7800 ఎకరాలు. పంపిణీ తర్వాత ఆయన వాటా 1800 ఎకరాలు. తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందే విద్యార్థి జీవితంలోనే రాజకీయాలలో దూకారు. నాటి సాయుధ పోరాటంలో కీలక పాత్రను పోషించారు. కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన “దున్నే వాడిదే భూమి” ప్రకారం ఆయన తన వాటా సాగుభూమి పేదలకు పంపిణీ చేశారు. కనీస నివాస స్థలం తప్ప సాగుభూమి ఆయనకు శేష జీవితంలో మిగిలింది లేదు. తర్వాత రాజకీయ జీవితం ఏమైనప్పటికీ, తొలుత తెలంగాణలో ఓ ఆది కమ్యూనిస్టు. తెలంగాణ లో పార్టీ ఆవిర్భావకాలంలో కీలకపాత్ర ఆయనది. తానే సర్వదేవభట్ల రామనాధం గారు.

తొలికాలపు ఆ త్యాగధనుడి జీవిత చరిత్ర ఇప్పటి వరకు ప్రచురణకు నోచుకోలేదు. అది ఇన్నాళ్ల తర్వాత మొదటిసారి వెలువడుతోంది.

అమరజీవి రాయల సుభాష్ చంద్రబోస్ @ రవన్న ఐదవ వర్ధంతి సందర్భంగా 9-3-2021న ఆయన స్మారక ట్రస్టు ప్రచురిస్తోంది. ఆయన స్వగ్రామమైన పిండిప్రోలు లో ఆవిష్కరణ జరగబోతోంది. ఆ గ్రామం ఖమ్మం సిటీకి 20 కిలోమీటర్లలోపు ఉంది.

ఈ పుస్తక రచయితలు రేపాకుల శివలింగం & డాక్టర్ కే. ముత్యం గార్లు. ఆ పుస్తక రాజకీయ ప్రాధాన్యత, ప్రాముఖ్యతల్ని తెలియజేసే కొన్ని ముఖ్యాంశాల్ని చిన్న బిట్స్ గా తెల్సుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *