ఉన్నట్లుండి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోదీ మీద దాడి! ఎందుకు?

మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తాండివిస్తున్న నిరుద్యోగం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆశించిన మేర ఉద్యోగాలు రిక్రూట్ చేయలేకపోవం, వచ్చిన నోటి ఫికేషన్లు మీద కోర్టు కేసులు, ఉద్యోగాల గురించి టిఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పుతున్న ‘తప్పుడు’ లెక్కలు ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా చర్చ నీయాంశమయ్యాయి. ఇందులో ప్రధానంగా వినబడుతున్న పేరు ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రధాని మోదీ చెప్పిన 12 కోట్ల ఉద్యోగాలెక్కడ? బిజెపి జవాబు చెప్పాలి: కెటిఆర్

 

ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని  ఐటి మంత్రి కెటి రామారావు 1.30 లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రకటించడం బాగా వివాదమయింది. దానికి తోడు దీని మీద తాను బహిరంగ చర్చకు సిద్దమని కెటిఆర్ ప్రకటించారు. ఆయన ప్రకటన విలువడిన 24 గంటలో కాంగ్రెస్ నుంచి బహిరంగ చర్చకు అహ్వానం వచ్చింది. కాంగ్రెస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్  హైదరాబాద్  గన్ పార్క్ దగ్గిర ఉన్న అమర వీరుల దగ్గిర బహిరంగ చర్చ ఏర్పాటు చేశారు.

 

1.3 లక్షల ఉద్యోగాలిచ్చి నట్టు కెటిఆర్ చెప్పేది ఫేక్ న్యూస్: కాంగ్రెస్ నేత దాసోజు శ్రవన్

కెటిఆర్ చెప్పినది ఫేక్ న్యూస్ అని ఆయన అన్నారు. గన్ పార్క్ దగ్గిర కెటిఆర్ కు ఒక మాంచి కుర్చీ  వేసి చర్చకు సిద్ధమయ్యారు. కెటిఆర్ రాలేదు. కెటిఆర్ తన అంకెలు తప్పని చెబుతూ ఆయన ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పారు. తన లెక్కలు తప్పని నిరూపిస్తే తాను ఇక్కడే గొంతు కోసుకుంటానని ప్రకటించి దాసోజు వెళ్లిపోయారు.

అంతేకాదు, బిజెపి, టిఆర్ ఎస్ ప్రభుత్వాలు రెండు కలిసి తెలంగాణకు రెండులక్షల నుంచి పది లక్షల దాకా ఉద్యోగాలొచ్చే ఐటిఐర్ ప్రాజక్టును మూలనపడేశాయని ఆయన ఆరోపించారు. అందువల్ల వీదర్దరు తెలంగాణ యువతను మోసగించారని ఆయన అంటున్నారు.

ఇక కెటిఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులు చర్చను ఢిల్లీ వైపు మళ్లించేందుకు ప్రయత్నించారు. అసలు ఉద్యోగాల్లేకుండా చేసింది ప్రధానియేనని ఇద్దరు  ప్రతి మీటింగ్ లో చెప్పడం మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ చేశాడని, ఈ లెక్కన ఇప్పటి దాకా 12 కోట్ల ఉద్యో గాలు ఇచ్చి ఉండాలని, అవేమయినాయో తెలంగాణ బిజెపి వాళ్లు చెప్పాలని కెటిఆర్ అడుగుతున్నారు. అసలు,  యువకులకు మోసం చేసింది మోదీయేనని, ఈ ఉద్యోగాల మీద జవాబు చెప్పకుండా బిజెపి ఎమ్మెల్సీ వోటు ఎలా అడుగుతుంది అని ఆయన ప్రశ్నించారు.

రిజర్వేషన్ల కింద బిసి,ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునేందుకే మోదీ పబ్లిక్ సెక్టర్ ను అమ్మేస్తున్నారు: హరీష్ రావు

ఇక హరీష్ రావు మరొక వైపు నుంచి నరుక్కొచ్చారు. ఉద్యోగాలివ్వకపోవడమే కాదు, ఉన్న ఉద్యోగాలను పీకేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. బిసి, ఎస్ సి,ఎస్ టి ల మీద మోదీ కక్ష కట్టాడని, వీళ్లందరికి రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలివ్వకుండా ఉండేందుకు నూరు పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ప్రవేటుపరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  ఈ కంపెనీలు ప్రయివేటు పరం అయితే, అక్కడి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండవని అపుడు బిసి, ఎస్ సి, ఎస్టీలకు ఉద్యోగాలే ఉండవని, చెబుతూ ఇాలాంటి ప్రభుత్వానికి ద్దతుగా బిజెపికి వోటేయవద్దని, బిజెపికి అభ్యర్థిని వోడించాలని హరీష్ రావు పిలుపునిస్తున్నారు.  వారి ఎన్నికల ప్రచారమంతా మోదీ చుట్టు తిప్పారు. కేంద్రం తెలంగాణకు ఏమిచేయలేదని, పెట్రోలు ధరలుపెంచారని, దీనితో ఆర్థిక వ్యవస్త అస్తవ్యవస్తమవుతున్నదని అన్నారు. తెలంగాణ కు తప్ప అన్ని రాష్ట్రాలకు సాయం చేస్తున్నారని అన్నారు. అనే లేదు గాని కెటిఆర్ , హరీష్ రావు విమర్శలకు సారాంశమేమిటని అడిగితే, మోదీ తెలంగాణ వ్యతిరేకి అనాల్సి వస్తుంది.

హరీష్ రావు, కెటిఆర్ ఇద్దరు ఇంత తీవ్రంగా  ఒక చిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కేంద్రం మీద విరుచుకుపడటానికి కారణమేమయి ఉంటుంది?

వారిద్దరు లేవనెత్తిన మరొక విషయం ఐటిఐర్ (information technology investment region) ను మోదీ ప్రభుత్వం పక్కనపడేయడం. ఇది యుపిఎ  ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన కానుక. జహీరా బాద్ దగ్గిర 50 వేల ఎకరాల భూమిని కూడా గుర్తించారు. రెండు మూడు లక్షల ఉద్యోగాలువచ్చే ప్రాజక్టు. యుపిఎ ఓడిపోవడం, మోదీ రావడం, ఇక్కడ రాష్ట్రం విడిపోయి టిఆర్ ఎస్ ప్రభుత్వం రావడంతో ఈ ప్రాజక్టును వదిలేశారు.

కాంగ్రెస్ ముద్ర ఉన్న ఈ ప్రాజక్టును  టిఆర్ఎస్ ప్రభుత్వం  సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే, అపుడపుడు  ఉత్తరాలు రాస్తూ వచ్చింది. దీని గురించి పార్టమెంటులో ఎంపిలు గొడవచేయడం వంటి పనులు చేయలేదు.  ఈ ప్రాజక్టు వెనక్కి పోవడం వెనక రెండు ప్రభుత్వాలూ ఉన్నాయి. అయితే, ఇపుడు ప్రధాని మీదకు చర్చ మళ్లించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఐటిఐఆర్ ను ఆయుధంగా వాడుకుంటున్నది.

‘ఇంత గొప్ప ప్రాజక్టు రాకపోవడానికి కారణం బిజెపి ప్రభుత్వమే. అసల రాష్ట్రానికి మోదీ చేసిందేమిటి?’ అనే  టిఆర్ ఎస్  ఒక ప్రాథమిక ప్రశ్న లెేవనెత్తింది.

పట్టభధ్రుల నియోజవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల  ప్రచారం లోకి ప్రధాని మోదీని లాగడంలో లాజిక్ ఏమై ఉంటుంది?

కెసిఆర్ జైలుకు పోవడం ఖాయం, కెసిఆర్ ను జైలుకు పంపేదాకా వదలను: బండి సంజయ్

బహుశా ఇది తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ క్షణ తీరిక లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ బమీద చేస్తున్న దాడి నుంచి తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా యువకులను పక్కకు మళ్లించడమేనా?

ఎందుకంటే, ఈ మధ్య బండి సంజయ్ చెబుతన్నదొక్కటే… తొందర్లోనే కెసిఆర్ ను జైలుకు పంపడం.

ప్రతి సభలోనూ ఆయన కెసిఆర్ ను జైలు కుపంపిస్తానంటున్నారు. అదే వరసలో ఆ మధ్య కెటిర్ కూడా జైలుకు పోవలసి వస్తుందని హెచ్చరించాడు.

కెసిఆర్ ఎంపిగా ఉన్నపుడు పార్లమెంటును తప్ప దోవ పట్టించారని,దానికి సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గిర ఉందని చెప్పారు. ఈ ప్రతాలు పార్లమెంటును కుదిపేస్తాయని, వాటిని వెల్లడించేందుకు తాను స్పీకర్ అనుమతి కోరానని చెబుతున్నారు.

ఆ పత్రాలు ఏమిటో, అందులో ఏముందో, కెసిఆర్ జైలుకుఎలా వెళ్తారో ఆయన చెప్పడం లేదు గాని ప్రతిరోజు ఏదో ఒక సభలో ఎపుడో ఒకసారి కెసిఆర్ జైలు గురించి చెబుతున్నారు.

లాలూప్రసాద్ యాదవ్, కరుణానిధిలకు ఏం జరిగిందో అదే కెసిఆర్ కు జరుగుతుందని, జైలు ఖాయమని చెబుతున్నారు.

తనను తన కుటుంబాన్ని జైలుకు పంపవద్దని కెసిఆర్ ప్రధాని ముందు ప్రాధేయపడుతున్నారని, పొర్లు దండాలు పెడుతున్నారని ఆయన డిచ్ పల్లిలో టిఆర్ ఎస్ నేతలు బిజెపి లో చేరుతున్న సభలో చెప్పారు.

అంతేకాదు, టిఆర్ ఎస్ కు చెందిన30 మంది ఎమ్మెల్యేలు బిజెపితో ‘టచ్’ లో ఉన్నారని టిఆర్ ఎస్  వాళ్లు బాగా ఇబ్బంది పడేలాగా గిల్లారు. ఇలా రోజు బండి సంజయ్ పేరు ‘కెసిఆర్ జైలు తప్పదు’, ‘త్వరలోకెసిఆర్ జైలుకు’, ‘కెసిఆర్ ను జైలుకు పంపుతా’ ఇలా హెడ్ లైన్ లు కనబడటం టిఆర్ ఎస్ నేతలకు తప్పకుండా ఇబందిగా ఉంటుంది.

2014 లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రికెసిఆర్ ని జైలు కు పంపిస్తానని రోజు ప్రకనటచేసిన  నాయకుడెవరూలేరు, బండిసంజయ్ తప్ప. దీనితో సంజయ్ మీద ఉన్న కోపాన్ని టిఆర్ ఎస్ నేతలు ప్రధాని మోదీ మీద చూపుతున్నట్లు అర్థమవుతుంది.

అందుకే ప్రధాని వల్లే ఉద్యోగాలు రావడం లేదని రేపుమార్చి  రెండో వారంలో జరుగుతున్న నిరుద్యోగ పట్టభద్రులకు అర్థమయ్యేలా కెటిఆర్ ,హరీష్ రావు వివరింగా చెప్పేందుకు పయత్నిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *