తెలంగాణ తొలి కరోనా కేసు దుబాయ్ నుంచి వచ్చింది… నాటి పరిస్థితి

తెలంగాణలో మొదటి కరోనా కేసు ఏడాది కిందట ఇదే రోజున అంటే మార్చి 2 వ తేదీన నమోదయింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆరోజు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకటి  ఢిల్లీలో నమోదయితే,రెండో ది తెలంగాణలో బయటపడింది. వీరిద్దరువిదేశాలనుంచి వచ్చిన వారే. డిల్లీ కరోనా పాజిటివ్ కేసు ఇటలీ నుంచి తిరిగొచ్చిన వ్యక్తిది అయితే, హైదరాబాద్ పాటిజివ్ కేసు దుబాయ్ వెళ్లివచ్చిన వ్యక్తిది. ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. మార్చి నాటికి మొత్తం భారత్ లో నమోదయిన కరోనా పాజిటివ్ కేసులు కేవలం 5 మాత్రమే.

పాజిటివ్ అని గుర్తించగానే అతనిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. నిజానికి ఆరోజుకి మరొక నలుగురిని అనుమానించినా వారి ఇన్ ఫెక్షన్ గురించి కేంద్రం నుంచి ధృవీకరణ సమాచారం అందలేదు.దీనితో దుబాయ్ కేసుమొదటి కేసు అయింది.

మొదటి కేసు నమోదయిన మరుసటి రోజు తెలంగాణ క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పరిస్థితిని సుదీర్ఘంగా చర్చించింది. పరిస్థితి మీద నిఘా పెట్టేందుకు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేశారు. నగరంలోని  అయిదు ఆసుపత్రులలో కరోనా చికిత్సకోసం 3000 పడకలను సిద్ధం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. కోవిడ్-19 ముప్పు ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రు 100 కోట్లు కేటాయించారు. ఈ  విషయాన్ని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఈ సమావేశంలోనే ఆయన కోవిడ్ -19 స్వైన్ ఫ్లూ కంటే పెద్ద ప్రమాదకరం కాదని ప్రకటించారు. అయితే, పది రోజుల్లోనే ప్రభుత్వం తీవ్రత గుర్తించింది. మార్చి 15 విద్యాసంస్థలన్నింటిని  మార్చి నెలాఖరుదాాకా మూసేసింది. సినిమా హాళ్లను,జిమ్ లను, ట్రేడ్ ఫెయిర్లను, బార్లను, జూను, మ్యూజియమ్ లను ఒక వారం మాత్రం మూసేయాలని ఆదేశించింది.వివాహాలకు 100 మందికి మించి  గుమికూడరాదని ముఖ్యమంత్రి కెసిఆర్ సలహా ఇచ్చారు.

కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజల్లో కరోనా చైతన్యం తీసుకువచ్చేందుకు  మార్చి 22న తెలంగాణ మొత్తం జనతా కర్ఫ్యూ పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ఆ ఆరోజు ఆదివారం ఉదయం ఆరు నుంచి మరసటి రోజు అంటే సోమవారం ఉదయం ఆరింటిదాకా ఈ కర్ఫ్యూ పాటించారు. పాల సరఫరా వంటి అత్యవసరమయినవి తప్ప మెట్రోరైళ్ళతో సహా అన్ని సర్వీసులు బంద్ అయ్యాయి. పరిస్థితి గమనించి మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసేస్తామని కూడా ముఖ్యమంత్రిప్రకటించారు. అపుడు మహారాష్ట్రలో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రు.10,000 కోట్ల దాకా నయినా ఖర్చుచేస్తామని, ఇప్పటికే అయిదు వేలు కేటాయించామని, మరొక రు. 500 కోట్లు ప్రధాన కార్యదర్శికి అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కరోనా రాకుండా గుళ్లో యజ్ఞయాగాదులు చేసేందుకు అనుమతిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

తర్వాత కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టింది. మార్చి 27 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 45 కు పెరిగింది. ఇందులో 9 మందికి ఇతర వ్యక్తుల నుంచి వ్యాపించింది.  కరోనా కేసుల సంఖ్యపెరగడంతో గాంధీ ఆసుపత్రి పూర్తిగా కరోనా చికిత్సా కేంద్రంగా మార్చారు. ఇతర కేసులన్నింటిని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, కింగ్ కోఠీ ఆసుప్రతికి మార్చడం మొదలుపెట్టారు.

కేసులు పెరుగుతుండటంతో ప్రవేటు ఆసుప్రతులను కరోనా చికిత్సకు వాడుకోవాలన్ని విషయం పరిశీలించేందుకు కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్  నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. అపుటికింకా పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ కూడా తెలంగాణలో అందుబాటులోరి  రాలేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *