కెటిఆర్ వి అన్నీ కాకిలెక్కలు : భట్టి విక్రమార్క

(మల్లు భట్టి విక్రమార్క)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ర్టంలోని టీఆర్ ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగలను మోసం చేయడంలో పోటీ పడుతున్నాయి.

ఉద్యోగాల  గురించి కాకి లెక్కలు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాయి.

ఇద్దరూ తోడు దొంగలే. ఎన్నికలు ముందు తిట్టుకోవడం ఎన్నికలయ్యాక లెక్కలు సర్దుబాటు చేసుకోవడం  ఈ రెండు పార్టీలు  చేసే పని.

నువ్వెన్నిఉద్యోగాలచ్చావంటే నీవెన్ని ఇచ్చావని రెండు పార్టీల నేతలు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారు.

అసలు ఇద్దరు ఎన్ని ఉద్యోగాలిచ్చారో చర్చకు రావాలి. రెండు ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచకపోగా నిరుద్యోగ సమస్య తీవ్ర చేశారు.

లేబర్ బ్యూరో తాజా లెక్కల ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 21.6 శాతం వుంటే తెలంగాణా నిరుద్యోగ రేటు 33.9 శాతం వుంది.

అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పకుండా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకళ్ళను మంచి మరొకరు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు.

సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోడీ గారు చెప్పారు .

ఆ లెక్కన గత ఏడు ఏళ్ళలో 14 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి కానీ కొత్తవి ఇవ్వకపోగా వున్నవి పోతున్నాయి.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వరంగంలో అనేక భారీ సంస్థలను, పరిశ్రమలను స్థాపించి దేశానికి ఆస్తులను కూడపెట్టాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో sc, st, bc వర్గాలు వారు తమ రిజర్వేషన్లు కోటా మేరకు ఉపాధిని, ఉద్యోగాలను పొందేవారు..

కానీ నేటి బీజేపీ ప్రభుత్వం , ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుండటంతో, తెగ నమ్ముతుండటంతో కొత్తగా ఒక్కరికీ ఉద్యోగం లేదు.

స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా లు ప్రచార ఆర్భాటానికి తప్ప కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా గ్రామీణ ఉపాధికి 34.5 శాతం నిధులను కట్ చేశారు.

కొత్త ఉద్యోగాలు సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి మోడీ పాలనలో.

భారత జనాభాలో మూడింట రెండింతలు మంది 35 ఏళ్ళ లోపు వారని దేశ నిర్మాణానికి వారి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం వుందని 2014 ఎన్నికలకు ముందు సభల్లో మోడీ చెప్పారు. మరి గద్దె నెక్కాక ఓరగబెట్టింది ఏమన్నా వుందా అంటే ఏమీ లేదు. సాధించింది ఏమిటంటే….గత 45 ఏళ్ళులో ఎన్నడూ లేనంత గరిష్టస్థాయికి నిరుద్యోగ రేటు చేరుకోవడం.

ఇక తెలంగాణా విషయానికొస్తే దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా వున్న రాష్ర్ర్టాల్లో తెలంగాణా కూడా ముందు భాగంలో వుంది.

తెలంగాణాను సాధించుకుంది నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం…కానీ నియామకాల విషయంలో నిరుద్యోగులకు తీవ్రని అన్యాయం జరగుతోంది.

తమ ఆశలు కేసీఆర్ తీరుస్తాడని యువత ఆశిస్తే ఆయన మాత్రం తన కుటుంబ సభ్యులు, వారి అనుయాయుల ఆశలనే తీరుస్తున్నాడు కానీ రాష్ర్ర్ట ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు…

ప్రజలు ఓడించిన కూతురికి ఉద్యోగం కల్పించేందుకు చూపిన వున్న శ్రద్ధ , రాష్ట్ర ఏర్పాటుకు, ముఖ్యమంత్రి అవడానికి కారణమైన నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై లేదు
నిరుద్యోగుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు దొరగారి ఫా హౌంజ్ కు, ప్రగతి భవన్ కు వినపడటం లేదు.

దుబాయి..బొంబాయి..బొగ్గు బావేనా ఉమ్మడి రాష్ర్టంలో మన బతుకులు అన్నాడు…మరి ఈయన వచ్చాక ఉద్ధరించింది ఏమిటి?

తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ తన ఇంటిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇచ్చుకున్నడు కానీ అసలు నిరుద్యోగులను వదిలేశాడు….

ఒక లక్ష 91 వేలు ఉద్యోగ ఖాళీలు వున్నాయని పే రివిజన్ కమిషన్ నివేదికలో చెప్పింది కదా.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని తెలంగాణా ఏర్పటయ్యాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఈ ఊసే ఎత్తడం లేదు…

పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య సంఖ్య 25 లక్షలు..

టీచర్ ఉద్యోగాల భర్తీ లేదు. ఒక్క డియస్సీ లేదు, విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు, అనేక విశ్వవిద్యాలయాల్లో ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు సహా అనేక పోస్టులు ఖాళీగా వున్నాయి…ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ప్రయివేటు విశ్వవిద్యాలయలపై శ్రద్ధ చూపుతోంది.

50 వేల ఉద్యోగాల భర్తీ అన్నది కూడా పట్టభద్రుల ఎంఎల్ సీ ఎన్నికలను ద్రుష్టి పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు, మాయమాటలు చెప్తున్నారు. ఎప్పటిలోగా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు, పరీక్షలు ఎప్పుడు, అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఎప్పుడు చేతిలో పెడతారో ఖచ్చితమైన తేదీని చెప్పగలరా? ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ప్రకటించాలి.

నిరుద్యోగభృతి ఊసేలేదు….3016 రుపాయలు ఇస్తానన్నారు కానీ ప్రస్తావన లేదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదు…

ఈ విధంగా నిరుద్యోగ యువత ను మోసాగిస్తున్న trs మరియు బీజేపీలను mlc ఎన్నికలలోను మాత్రమే కాకుండా రానున్న అన్ని ఎన్నికలలోను ఓడించాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను.

 

(మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ అసెంబ్లీ ప్రెస్ మీట్ విశేషాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *