మొట్టమొదట ‘పద్మశ్రీ’ అందుకున్న సౌత్ ఇండియా నటుడెవరు?

మొట్ట మొదట పద్మశ్రీ  పురష్కారం అందుకున్న దక్షిణ భారత సినిమా నటుడు చిత్తూరు నాగయ్య. చిత్తూరు నాగయ్య సినిమా రంగ ప్రవేశం చిత్రంగా జరిగింది. ఆయన స్వాతంత్య్రో ద్యమంలో పాల్లొనే రోజులలో మంచి గాయకుడిగా పేరుండేది. అయితే, బతుకు దెరువుకోసం ఆయన గ్రామఫోన్ రికార్డు కంపెనీలకు పాడుతూ వచ్చారు. ఆ రోజులో ఆయనకు గ్రామ్ ఫోన్ ప్లేట్ ఆర్టిస్టు గా మంచిపేరు తెచ్చుకున్నారు. గుండ్రంగా ఉండే గ్రామఫోన్ రికార్డు ను ప్లేట్ అనే వాళ్లు. ప్లేటుకి రెండు వైపులా పాటలు ఉండేవి. ఒక పాట అయిపోయాక పేట్లు మార్చితే రెండో పాట వినవచ్చు. రాజకీయాల్లో పార్టీ పిరాయింపుని ప్లేటు మార్చడం అని అనడం వెనక రహస్యం ఇదే.

అలా గ్రామఫోన్ రికార్డు కు కంపెనీకి పాడుతూ ఆయన చిత్తూరు, బెంగుళూరుల మధ్య తిరుగుతూ ఉండేవారు. తర్వాత ఆయన  మద్రాస్ ప్రెశిడెన్సీ రాజధాని అయిన మద్రాసు నగరానికి మకాం మార్చారు.

మద్రాసుకు వచ్చాక చెన్నపురి ఆంధ్ర మహాసభ వారి నాటకాలలో నటిస్తూ వచ్చారు. విక్టోరియా హాల్ లో ఒక సారి ఆయన వేసిన నాటకాన్ని  బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బిఎన్ రెడ్డి) చూశారు. బిఎన్ రెడ్డి, హెచ్ ఎం రెడ్డితో కలసి గృహలక్ష్మి తీస్తున్నపుడు నాగయ్యకు అవకాశం వచ్చింది. ఈ చిత్రం తర్వాత రెడ్డి గారిద్దరు చెరోదారి చూసుకున్నారు. అపుడు నాగయ్య బిఎన్ రెడ్డి ప్రారంభించిన  వాహిని పిక్చర్స్ (1939) తో ముందుకు సాగాలనుకున్నారు. వాహినీ వారి తొలి చిత్రం ‘వందే మాతరం’ తీసినపుడు ఆయనకు మంచి అవకాశం వచ్చింది. నాగయ్య ఈ చిత్రానికి సంగీతం కూడా సమకూర్చారు.  మొత్తంగా 137 తెలుగు సినిమాలు,  92 తమిళ సినిమాలు, ఎనిమిదేసి కన్నడ, హిందీ సినిమాలో నటించారు. చిత్రాలను నిర్మించారు, కొన్నింటికి దర్శకత్వం వహించారు. ఆయన తమిళ చిత్రం ‘మీరా’ కళాఖండం.  ఇందులో ఎంఎస్ సుబ్బులక్ష్మి నటించారు. ఆయన నటించిన తమిళ చిత్రం ‘అశోక్ కుమార్ ’ కొన్ని సెంటర్లలో 40 వారాల ఆడి రికార్డు సృష్టించింది.ఆయననటించిన ‘త్యాగయ్య’ చిత్రాన్ని మైసూరు మహారాజు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేసుకుని చూశారు.

ఆ రోజుల్లో ఆయన నటనను కొనియాడని, తెలుగు, తమిళ, ఆంగ్గ పత్రికలు లేవు.    ఆయన చిత్రాలెన్నో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన పోతన, త్యాగరాజు,రామదాసు, వేమన వంటి పాత్రలలో ఆయన గొప్పగా ఒదిగిపోయి,నిజంగానే వాగ్గేయకారులు, కవులు ఇలాగే ఉండేవారేమో అని భ్రాంతి కల్పించే వారు.  1965లో భారత ప్రభుత్వం ఆయనను  పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక దక్షిణ భారత సినిమానటుడికి పద్మశ్రీ గౌరవం దక్కడం అదే మొదటి సారి.

 

అయితే పద్మశ్రీ వచ్చేనాటికి  ఆయన దగ్గిర చిల్లిగవ్వలేకుండా పోయింది. నలుగురికి సాయం చేసే గుణం, ఖర్చులు పెరగడంతో ఆయన పేదరికంలో పడిపోయారు. అందుకే, పద్మశ్రీ వచ్చాక, తన దగ్గిర  పద్మం ఉంది గాని ‘శ్రీ’ లేదని వ్యాఖ్యానించే వారు. ఆయన నుంచి సాయం చేసిన వాళ్లు అంతా వెళ్లిపోయారు. 1973 డిసెంబర్ 30న నాగయ్య చనిపోయారు.  మిగిలిన  వాళ్లు చెన్నై పానగళ్  పార్క్ లో ఆయన విగ్రహం నిలబెట్టారు (1977).

కొందరు ఆయనను ప్రఖ్యాత హాలివుడ్ నటుడు పాల్ మూనీ (Paul Muni) తో పోలస్తూ Paul Muni of South India అన్నారు. పాల్ మూనీ The Life of Louis Pasteur  చిత్రానికి  1936లో బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డు తీసుకున్నారు. ఆ రోజుల్లో పాల్ కు మించిన క్యారెక్టర్ యాక్టర్ లేరు. ఆయన నటించిన 25 సినిమాలకు  బెస్ట్ యాక్టర్ నామినేషన్ గౌరవం దక్కింది.  తర్వాత ఆయన సినిమాలు వదిలేసి స్టేజి నాటకలకే పరిమితం అయ్యారు.

1938 నుంచి 1950 దాకా దక్షిణ భారత సినీ రంగంలో మేటి క్యారెక్టర్ యాక్టర్ నాగయ్య. తలవూపుతూ గాద్గదికంగా మాట్లాడటం నాగయ్య ప్రత్యేకత. అందుకే ఆయన సంపన్నుడి పాత్ర నుంచి పేద వాడి పాత్ర దాకా అన్నింటిలో ఒదిగిపోయేవాడు.

చివరి దాకా ఆయన ఏదో పాత్ర వేయాలని ప్రొడ్యూసర్లు అడగుతూ వచ్చారు.

” Even as he was in his death bed, there were film producers asking him to do just that role of a sick man for their film to adjust his obligations “అని సీని విశ్లేషకుడు కెఎన్ టి శాస్త్రి Chittoor V Nagaiah: A Monograph లో రాశారు.

నాగయ్యపుట్టింది గుంటూరు జిల్లా రేపల్లెలో. చిత్తూరు జిల్లాకు చెందిన తాతగారు దత్తత తీసుకోవడంతో ఆయన చిత్తూరు  నాగయ్య అయ్యారు. టిటిడి స్కాలర్ షిప్ తో ఆయన చిత్తూరులో చదువుకున్నారు. కొద్ది రోజులో ఉద్యోగం చేశాక, ఆంధ్రపత్రికలో జర్నలిస్టు గా చేరారు. అపుడే గాంధీ ప్రభావంతో జాతీయోద్యమంలోకి దూకారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *