హైద్రాబాద్ లో ఐపిఎల్ నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అందువల్ల తెలంగాణ రాజధానిలో ఐపిఎల్ మ్యాచ్ నిర్వహించాలని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు బిసిసిఎల్ కు, ఐపిఎల్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ లో కోవిడ్ ప్రభావం పెద్దగా లేని విషయాన్ని కూడా వారికి ట్విట్టర్ ద్వారా గుర్తు చేశారు.
హైద్రాబాద్‌లో కోవిడ్ కేసులు బాగా తక్కువగా నమోదువుతన్నవిషయం చెబుతూ మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే కోవిడ్ విషయంలో హైదరాబాద్ చాలా మెరుగు అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఐపిఎల్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలను ఎంపిక చేశారని వార్తలు వస్తూండటంతో ఈ జాబితాలో హైదరాబాద్ ని కూడా చేర్చాలని కెటిఆర్ ఈవిజ్ఞప్తి చేశారు.
Open appeal to @BCCI and @IPL office bearers to include Hyderabad as one of the venues for upcoming IPL season
Our effective COVID containment measures are reflected in our low number of cases among all metro cities in India & we assure you of all support from the Govt
— KTR (@KTRTRS) February 28, 2021
కెటిఆర్ ట్వీట్ కి స్పందన ఇలా ఉంది…
హైదరాబాద్ లో ఇపీఎల్ మ్యాచులు జరిగితే అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అంటున్నారు… మీరేమో హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు పెట్టాలంటున్నారు….
— Rangu Sadanandam Goud (@RanguSadananda3) February 28, 2021
Telangana is a failed state , garbage on road sides is everywhere , no initiatives by the govt to get rid of trash , i thought i did the right thing voting for @trspartyonline , now i realize it was not worth it , I’m gonna have my friends rethink about this govt , @KTRTRS
— chuck Feeney (@Chuck_Feeney_12) February 28, 2021
Mundhu uppal stadium ni baagu cheyandi sir
Vere stadiums ela unnai uppal ela undhi
HCA is not working properly appudu meere edho oka action theeskovali— G AR (@G0305001) February 28, 2021