ఒకవైపు కొన్ని రాష్ట్రాలలో కరోనా కొత్త కేసులు పెరుగుతుంటే, మరొక వైపు మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలవుతున్నది. ఈ పారి ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తున్నందున కేంద్రం ప్రయివేటు వ్యాక్సిన్ ధర నిర్ణయించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.150, సర్వీస్ ఛార్జి రూ.100 మొత్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250 దాటకూడదని కేంద్రం పేర్కొంది.
అంటే రెండు డోసులకు రు. 500 దాటకూడదు. 28 రోజుల తేడాతో రెండు డోసులు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో పన్నులు కూడా కలిసే ఉంటాయి.
మొట్టమొదటి సారిగావ్యాక్సిన్ అమ్మకానికి దొరుకుతున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఖర్చు కేంద్రం భరిస్తుంది. ప్రభుత్వం సీరమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డోస్ ధర రు.200 లకుకొనుగోలు చేసింది. ఇక భారత్ బయోటెక్ నుంచి రు. 295కు కొనింది.
అయితే, వ్యాక్సిన్ ప్రజలందరికి ఉచితంగా ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అయితే, కేంద్రం ప్రయివేటు ఆసుపత్రులలో ఉచితంగా సరపరా చేయడం సాధ్యం కాదని పేర్కొంది.
వ్యాక్సినేషన్ జనవరి 16న మొదటయింది. మార్చి ఒకటినుంచి దశవ్యాక్సినేషన్ మొదలవుతుంది. ఇందులో సీనియర్ సిటిజన్స్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 45 సంవత్సరాల పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకుంటారు.
కొన్ని రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయి
కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులభారం పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయింది. ఈ రోజు కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు. ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్య ప్రదేశ్,చత్తీష్ గడ్, పశ్చిమబెంగాల్, జమ్ముకాశ్మీర్, తెలంగాణ. ఒక వారంగా ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగడం కనిపిస్తున్నది. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కరోనా నియమాలు ఉల్లంఘించే వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్రాలకు కేంద్రం సూచనలిచ్చింది.