అంగారక గ్రహం మీద ప్రాణి ఉనికి అచూకి అన్వేషించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా (NASA) పర్సివరెన్స్ (Perseverance) సురక్షితంగా గురువారంనాడు గ్రహం మీది ఒక గోతిలో భద్రంగా కాలుమోపింది. ఇలా మానవ ప్రపంచానికి బయట మనిషి పంపిన పరికరం ప్రాణి అన్వేషణ (Astrobiology)కోసం మరొక గ్రహం మీద కాలుమోపడం ఇదే తొలిసారి.
క్యాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ సంబరం చేసుకుంది. 203 రోజుల ప్రయాణం, 293 మిలియన్ మైళ్లు(472 మిలియన్ కి.మీ) దూరం ప్రయాణించి పర్సివరెన్స అంగారకుడిమీదికి చేరుకుంది. అత్యంత ఆధునికపరికరాలతో ఉన్న పర్సివరెన్స్ ను 2020 జూలై 30న కేప్ కెనవరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించారు. ఎపుడైనా అంగారక గ్రహం మీద జీవం ఉండిందాఅనేదాన్ని శోధించడం ఈ అంగారక యాత్ర ప్రత్యేకత. దీనికోసం పర్సివరెన్స్ అంగారకుడి మీది నుంచి మట్టి శాంపిల్స్ ను తీసుకుని వస్తుంది.
పర్సివరెన్స్ అంగారకుడి మీద దిగాక పంపిన తొలి ఫోటో ఇది.
హజార్డ్ కెమెరాస్ నుంచి పంపిన ఈ ఫోటో అక్కడి లేచిన దుమ్ము వల్ల కొంత మసక మసకగా కనిపిస్తుంది.
A key objective for Perseverance’s mission on Mars is astrobiology, including the search for signs of ancient microbial life. The rover will characterize the planet’s geology and past climate, pave the way for human exploration of the Red Planet, and be the first mission to collect and cache Martian rock and regolith.
Subsequent missions, currently under consideration by NASA in cooperation with ESA (European Space Agency), would send spacecraft to Mars to collect these cached samples from the surface and return them to Earth for in-depth analysis: NASA
https://trendingtelugunews.com/top-stories/breaking/nasa-mars-probe-perseverance-rover-launch-success/