ఎంత నిర్లక్ష్యం! పొదల మధ్య మొదటి దళిత ముఖ్యమంత్రి విగ్రహం

తిరుపతి నగరంలో అర్బన్ హాట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921-మే 8,1972) విగ్రహానికి అవమానం జరిగింది. ఆయన భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి. నిలువెత్తు నిజాయితీ పరుడు. సాహితీ వేత్త. విద్యాధికుడు. ఆయన కు తిరుపతిలో జరిగిన  అవమానాన్ని, అధికారులు ఆయన పట్ల చూపుతున్న ఉదాసీనతను రిటైర్డు జడ్జి పి గురప్ప వెలుగులోకి తెచ్చారు.

ఆ మహానేత  శత జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే తిరుపతి అర్బన్ హాట్లో సంజీవయ్య విగ్రహం ఒకటి ఉందన్న విషయం తుడా, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగానికి తెలియకపోవడం దురదృష్టకరం.


శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ఆ మహా నేత విగ్రహానికి పూల దండ వేసిన పాపాన పోలేదు.

దట్టమైన పొదలు, దుర్గంధం మధ్య మట్టికొట్టుకుపోయిన విగ్రహానికి విముక్తి కల్పించే నాధుడు కరువయ్యారు.

2013లో మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరాకుమారి చేతులు మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది.

దాదాపు 8 ఏళ్లు గడచినప్పటికీ సంజీవయ్య విగ్రహం గోస పట్టించుకోకపోవడంతో చుట్టూ దట్టమైన పొదలు పెరిగిపోయి, విగ్రహం బయటి ప్రపంచానికి తెలియని దుస్థితి దాపురించింది.

అధికారులు స్పందించాలని, రిటైర్డు జడ్జి పి గురప్ప కోరుతున్నారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/damodaram-sanjeevaiah-birth-anniversary/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *