విశాఖ స్టీల్ మీద ముఖ్యమంత్రి జగన్ ‘మన్ కీ బాత్’

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కార్మిక సంఘాల నేతలతో ముఖ్యంత్రి  వైయస్‌ జగన్‌ విశాఖ విమానాశ్రయంలోని ప్రత్యేక లాంజ్‌లో సమావేశమయ్యారు. దాపు గంటసేపు వారితో చర్చించారు. ప్లాంట్ ను కాపాడుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను  ఆయన వారికి వివవరించారు.

ఆయన తన మనసులో మాట ను పంచుకున్నారు. ఇవీ విశేషాలు:

మనసా, వాచా, కర్మేణా ఈ ప్లాంటును కాపాడుకోవాలనే నిబద్ధతతో ఉన్నాం, కచ్చితంగా అదికూడా చేస్తాం.

పోస్కోకు సంబంధించి కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు.
పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్నుకలవడం కూడా వాస్తవం.
కడప, కృష్ణపట్నం, భావనపాడు లాంటి చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని నేను వారిని కోరాను. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పాను.
కడప అయితే బాగుంటుందని కూడా వారికి చెప్పాను. నిన్నకూడా వాళ్లు కృష్ణపట్నం వెళ్లారు.

పోస్కో వాళ్లు విశాఖరావడానికి తీవ్రంగా యత్నిస్తున్నారన్నది సరికాదు. కృష్ణపట్నం, భావనపాడుల్లో పెట్టేందుకు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. వాళ్లు
కృష్ణపట్నం, భావనపాడు, కడపల్లో ఎక్కడకు వచ్చినా పర్వాలేదు.  మరింతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది:
దీనిపై వారితో చర్చలు జరుపుతాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేయాల్సిందంతా చేస్తాం.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవు:
ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ ప్లాంట్‌ వచ్చిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణ కాకుండా మనం ఒత్తిడి తీసుకువస్తున్నాం.

స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలో ముఖ్యమంత్రి జగన్

నాపై నమ్మకం ఉంచినందుకు, మీరు ఆప్యాయతను చూపిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. విశాఖ స్లీట్‌ ప్లాంట్‌ గురించి మీకు తెలియని విషయాలు లేవు. కార్మిక నేతలందరికీ అన్నీ విషయాలూ తెలుసు : సీఎం
నాకన్నా ఎక్కువగా స్టీల్‌ప్లాంట్‌ గురించిన సమగ్ర విషయాలు మీకు తెలుసు. ఏ నేపథ్యంలో ఈ స్టీల్‌ ఫ్యాక్టరీ వచ్చిందీ, 32 మంది ప్రాణాలు కోల్పోయిన ఫ్యాక్టరీ ఎలా వచ్చిందో మీకు తెలుసు.

ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తూ స్టీల్‌ ఫ్యాక్టరీని బాగుచేయడానికి ఒక కార్యాచరణలను సూచిస్తూ ప్రధాన మంత్రిగారికి లేఖ కూడా రాశాను. ఇంత సుదీర్ఘంగా లేఖ రాసినా కూడా వక్రీకరించే కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్‌ పొలిటికల్‌ నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు లేఖే రాయలేదంటున్నారు.

ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖరాసి, దాన్ని మీడియాకు విడుదలచేసిన తర్వాత, లేఖే రాయలేదని చెప్పగలిగే పరిస్థితిలోకి పోతున్నారు అంటే  వాళ్లకు ఏమేరకు ఐక్యూ లెవల్స్‌ ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు.

మన లేఖ అందినట్టుగా ప్రధాన మంత్రి కార్యాలయం రాసిన లేఖ రిసిపిట్స్‌ కావాలంటే చంద్రబాబుగారికి పంపించాలని కార్మిక సంఘం నేతలుగా మిమ్మల్ని కోరుతున్నా, మీ ద్వారానే ఈ రిసిపిట్స్‌ పంపిస్తే బాగుంటుంది.

ఇంత గొప్ప గొప్ప ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, కనీసం ప్రధానమంత్రికి ఒక లేఖ రాయాలన్న ఆలోచన వారికి రావడంలేదు. ఇంతవరకూ వారినుంచి ప్రధానమంత్రికి లేఖ రాయలేదు. మనం రాసిన లేఖలో మనం సుదీర్ఘంగా సమస్యకు పరిష్కారాలను వివరించాం, ఒక మార్గదర్శక ప్రణాళికను సూచించాం.

దాదాపు 22వేల కోట్ల రూపాయల అప్పులు ఈ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్నాయి.
రూ.12వేల కోట్ల రూపాయలు దీర్ఘకాలిక రుణాలు, మరో రూ. 10–11 వేల కోట్ల రూపాయలు వక్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో తీసుకుని, లాంట్‌ టర్మ్‌ అప్పులుగా కన్వెర్ట్‌ అయినవి ఉన్నాయి.

14శాతం వడ్డీకి కూడా కొన్ని కొన్ని బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు లేకపోవడంవల్ల ప్రతి టన్నుకు రూ.4వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలను కూడా ఉటంకిస్తూనే మార్గాలను కూడా ప్రధానమంత్రిగారికి రాసిన లేఖలో చెప్పాం.

సమీపంలో ఉన్న ఒడిశాలో రాష్ట్రంలో ఈ ప్లాంటుకు సొంతంగా గని కేటాయించాలని, ఆరాష్ట్రంలో పుష్కలంగా ఇనుపఖనిజం నిల్వలు ఉన్నాయని చెప్పాం. అక్కడ గనులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పాం:
దీన్ని మరింత లోతుగా చూస్తే ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఈఐఎల్‌ పేరుతో ఇప్పటికే ఒడిశాలో ఐదు మైన్స్‌ ఉన్నాయి. కాకపోతే వాటి లీజు ఒప్పందాల కాలంతీరిపోయింది. వాటిని పునరుద్ధరించాల్సి ఉంది.

ఈ గనుల్లో దాదాపు 51శాతం వాటా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఉంది, మిగిలినది ఎల్‌ఐసీ, కేంద్ర ప్రభుత్వానికి, 1శాతం ఒడిశా మినరల్‌ డెవలప్ ‌మెంట్‌కార్పొరేషన్‌కు వాటాలున్నాయి.

ఈ మైన్స్‌ ఏ పరిస్థితుల్లో ఉన్నాయని విచారణ చేశాను. మనం ప్రయత్నాలు చేసి ఈ గనులనుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అసరం ఉంది. ఈ గనుల్లో 200 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది.

రాబోయే సంవత్సరాలకు సరిపడా లీజులు ఉన్నాయి, ఈ గనులను నిర్వహణలోకి తీసుకురావాలి అంతే.సరిపోకపోతే మరికొంత నిల్వలను కేటాయించుకోవాల్సి ఉంటుంది.

వీటన్నింటినీ కూడా సూచిస్తూ ఒక ప్రతిపాదనను పెట్టడం జరిగింది:
ఏపీలో ఇను ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లో గ్రేడ్‌ గనులున్నాయి:
ఉన్న నిల్వలు కూడా ఈ ప్లాంటు సామర్థ్యానికి సరిపోవు :
ఏడాదికి దాదాపు 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉంది.

అందుకనే ఒడిశాలో ఉన్న గనుల లీజులు పునరుద్ధరించాలని చెప్పాను.
ఒక గనికి అటవీ అనుమతికూడా లభించిందని చెప్తున్నారు.మరో నాలుగు నెలల్లో సొంతంగా ఒడిశాలో గనికూడా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సొంతంగా గనులు ఇవ్వడం ఒక అంశం అయితే…, బ్యాంకులు ఎక్కవ వడ్డీకి ఇచ్చిన రుణాలు ఈక్విటీల రూపంలోకి మారిస్తే.. వడ్డీల భారం తగ్గుతుంది:
ఆ మేరకు రూ.2500 కోట్ల రూపాయలనుంచి రూ.3వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉండదు, అలాంటప్పుడు కంపెనీ లాభాల్లోకి వస్తుంది:
బ్యాంకులు కూడా నష్టం జరక్కుండా స్టాట్‌ఎక్సేంఛీలోకి లిస్టింగ్‌ చేసి, ఆ తర్వాత బ్యాంకులు ఎగ్జిట్‌ ఆప్షన్‌ వాడుకోవచ్చు.లేదా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లొచ్చు.

వడ్డీలు కట్టాల్సిన అవసరంలేని పరిస్థితుల్లో, అప్పులు ఈక్విటీలుగా మార్పు చెందించే పరిస్థితుల్లో లాభాల్లోని సంస్థగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్తే.. పరిస్థితి మెరుగు అవుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా లేఖలో రాయడం జరిగింది. ఇవికాక స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20వేల ఎకరాల భూములున్నాయి:
ఇందులో ఉపయోగించని భూమి కనీసం 7వేల ఎకరాలు ఉంటుందని చెప్తున్నారు.

ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు అనుమతి మేం ఇస్తాం:
ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం కూడా పెట్టం:
ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి.. ఎలాంటి అభ్యంతరం పెట్టం.

ఆ భూములను ప్లాట్లు వేసి, లే అవుట్లు వేసి… స్టీల్‌ప్లాంట్‌చేతే విక్రయించి, వచ్చిన డబ్బును స్టీల్‌ప్లాంట్‌లోనే పెట్టేయండి. దీనివల్ల కంపెనీలో ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయి. స్టీల్‌ప్లాంట్‌ సంపన్నంగా మారుతుంది.

ఈ మూడు సలహాలు ఇస్తూ … ఈ మాదిరిగా చేస్తే.. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటు వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రభుత్వం రంగంలోనే ఉంటుంది:
మంచి సంస్థగా మారుతుందని చెప్తూ ప్రధానికి లేఖరాశాం. ఏం జరుగుతుందో చూద్దాం, మనకు ఇప్పటివరకూ రిప్లై రాలేదు. కచ్చితంగా రిప్లై వస్తుంది.

మనం కూడా లేఖరాసి 10 రోజులు అయ్యింది.స్థానిక బీజేపీ నాయకులు కూడా స్టీల్‌ప్లాంట్‌అంశానికి మద్దతు ఇవ్వడం మంచిది. మనం సూచించిన సలహాలతో వాళ్లపార్టీకి చెందిన స్థానిక నాయకులు కన్విన్స్‌ అయి కేంద్రంమీద ఒత్తిడి తీసుకురాగలిగితే మన పని మరింత సులభం అవుతుంది.

వాళ్లు కూడా రకరకాలుగా ఢిల్లీలో చర్చలు జరుపుతున్నట్టు పేపర్లో చూస్తున్నాం. ఈ ప్రక్రియ జరగనివ్వండి, మనం కూడా మనకున్న దౌత్యంతోకూడిన సంబంధాలతో ప్రభుత్వం తరఫునుంచి కూడా చర్చలు కొనసాగించే కార్యక్రమాలు చేస్తాం.

రాబోయే రోజుల్లో ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని గట్టిగా నేను నమ్ముతున్నాను.

6.3మిలియన్‌ టన్నుల గత ఏడాది సామర్థ్యాన్ని ప్లాంట్‌కు తీసుకు రాగలిగాం. ఈలోపల అయితే ప్లాంట్‌ అన్నది కచ్చితంగా ఎక్కడా మూతపడకుండా.. అంతకన్నా మెరుగ్గా ప్లాంటును నిర్వహించాలని కార్మికులను కోరుతున్నా.

కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంటు మూతబడింది, ఉత్పత్తి జరిగ్గా జరడంలేదన్న మాట అవతలివాళ్లనుంచి రానీయకుండా చూసుకోండి:
అన్నిరకాలుగా ప్లాంట్‌కు సపోర్టు చేస్తూ ఉత్పత్తి అన్నది ఎక్కడా కూడా తగ్గనీయకుండా మీరు నిర్వహించాలి.

ప్లాంట్‌ సామర్థ్యానికి తగినట్టుగా నడిస్తేనే, ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, లాభాలు ఇంకామెరుగ్గా మనం చూపించగలుగుతాం:
విరామం సమయంలో మాత్రమే ధర్నాలు, ఆందోళనలు చేయాలని నా వినతి.

మిగిలిన సమయంలో మన పనులు, మనం చేసుకోవాలి:
ఫ్యాక్టరీ నడపాలి, ఒక్కరోజైనా ఫ్యాక్టరీ మూతబడింది, ఉత్పత్తి రావడంలేదనే మాట రాకూడదు. ఫ్యాక్టరీ నడపాల్సిన బాధ్యత కార్మిక సంఘాల భుజస్కంధాలమీద ఉంది. ఒకవైపున చేయాల్సినవన్నీ చేస్తాం.. అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాల్లో తీర్మానం పెడతాం.

ఈ లోపల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాను:
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం కూడా నాకు ఉంది. లేని పక్షంలో కేంద్రంపైన మరింత ఒత్తిడి తీసుకురావడానికి అసెంబ్లీలో తప్పకుండా తీర్మానం పెడతాం. ఇందులో రెండో రకమైన ఆలోచన లేదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *