విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఆయన చేత పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆశ్రమంతో ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.ముఖ్యమంత్రి వెంబడి మంత్రులు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఆశ్రమంలో అయిదు రోజుల వార్షికోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూజలలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వచ్చారు. ఫోటోలు