‘సిఎం ఆఫ్ ది ఇయర్’ కు ఎపి ప్రభుత్వోద్యోగుల శుభాకాంక్షలు

పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ “సిఎం ఆఫ్ ది ఇయర్” గా గుర్తింపు పొందినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రధానంగా ఆరోగ్య శ్రీ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ చేయూత (పథకం ద్వారా  మధ్య వయస్కులైన మహిళలకు నగదు ఇవ్వడం ద్వారా మహిళల సాధికారత వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న  ముఖ్యమంత్రి  స్కాచ్‌ గ్రూపు  ‘సీఎం ఆఫ్‌ ది ఇయర్’‌ అవార్డు కు ఎంపిక కావడం రాష్ట్రాని కంతటికి గర్వకారణమని AP JAC అమరావతి రాష్ట్ర కమిటీ చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ వైవీ రావులు తెలిపారు.

సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు నేరుగా తీసుకుని వెళ్లడం జగన్ నేతృత్వంలోని  ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న విధానమని  చెబుతూ
ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ, సామాజిక పెన్షన్లను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపడం అపూర్వం అని వారు పేర్కొన్నారు.

ఇలాగే,  25 లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీ లాంటి గొప్ప కార్యక్రమాలను,  మరీ ప్రత్యేకంగా అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులను, ఉద్యోగులను సిద్ధంచేసి కరోనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవను దేశమంతా గుర్తించిందనేందుకు ఈ పురస్కారం సాక్ష్య మని వారు పేర్కొన్నారు.

“ప్రభుత్వం లో పని చేస్తున్న చిరు ఉద్యోగులు, కార్మికులు జీతాలు పెంచడం ఉదాహరణకు VRA లు, హోంగార్డుల జీతాలు పెంచడం, పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచడం చాలా సంతోషించాం. మరీ ప్రత్యేకంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం అనగా RTC ఉద్యోగులను దాదాపు 70,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అంశం. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాబోయే రోజుల్లో 11వ PRC అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై కూడా తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని  మాకు సంపూర్ణ నమ్మకం,” ఉంది అని బొప్పరాజు, వైవీ రావులు తెలిపారు.

ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయటం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు  ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా తమ పనితీరు కనబరుస్తామని వారు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *