కుప్పం నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలోకి పెద్ద ఎత్తున బయటి ప్రాంతాల చొరబడ్డారని, నియోజక వర్గంలో ఎక్కువ మంది వారే కనిపిస్తుండటం పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రక్రియను సక్రమంగా సాగనీయకుండా చేసేందుకు వీళ్లంతా ఇక్కడి వచ్చినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కుప్పం మీద అడుగుడుగునా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టి, పరిస్థితి ఈ ‘సంఘవ్యతిరేక శక్తుల’చేతుల్లోకి జారుకోకుండా చూడాలని ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కుప్పంలోని హోటళ్ళలో ఉంటున్న ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకుల వాహనాల ఫోటోలను కూడా ఆయన లేఖకు జత చేశారు.
లేఖలోని ప్రధానాంశాలు:
2021 ఫిబ్రవరి 17 న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ లో పాలక వైసీపీ నాయకులు ప్రోత్సహించిన దురాక్రమణదారులు మరియు సంఘ వ్యతిరేక శక్తులు అధిక సంఖ్యలో పాగా వేశారు.
2021 ఫిబ్రవరి 17 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించేందుకు బయటి నుండి వైసీపీ నాయకులు కుప్పం పట్టణంలోని హోటళ్ళు మరియు లాడ్జిలలో తిష్టవేశారని నా దృష్టికి వచ్చింది.
2021 ఫిబ్రవరి 17 న (బుధవారం) కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కాబట్టి, ఈ బయటి వ్యక్తులు శాంతిభద్రతలను దెబ్బతీసి నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తారనే అనుమానం మాకు ఉంది.
బయటి నుండి వచ్చిన దురాక్రమణదారులు మరియు సంఘ వ్యతిరేక శక్తులు హింసను ప్రేరేపించి పోలింగ్ మరియు లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడతారనే సందేహం ఉంది.
అందువల్ల, కుప్పం అసెంబ్లీ విభాగానికి చెందిన ఎమ్మెల్యేగా, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ లోని గ్రామ పంచాయతీలకు సజావుగా, శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించడానికి ఈ క్రింది అంశాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) కు విజ్ఞప్తి చేస్తున్నాను.
1. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాలు మరియు లెక్కింపు కేంద్రాలలో మరియు చుట్టుపక్కల సిసిటివిలతో లేదా నిరంతరాయంగా వీడియో రికార్డింగ్ చేయాలని 2021 ఫిబ్రవరి 13 మరియు 15 తేదీలలో ఎస్ఇసి జారీ చేసిన సర్క్యులర్లను అమలు చేయండి.
2. 16.02.2021 నాటి రిట్ పిటీషన్ నం. 3660/2021 లో జారీ చేసిన గౌరవనీయ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి.
3. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ‘బయటివారిని’ పంపించేయండి.
4. హింసాత్మక దాడులు మరియు బెదిరింపులను నివారించడానికి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ మరియు లెక్కింపు కేంద్రాలలో మరియు చుట్టుపక్కల అదనపు రక్షణ బలగాలను కేటాయించండి.