స్వీడెన్ పర్యావరణవాది గ్రేటా థున్ బెర్గ్ ఢిల్లీ రైతులకు మద్దతు తెలుపుతూ ఆమధ్య ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. థున్ బెర్గ్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన గ్లోబల్ సెలెబ్రిటీ. ఆమె పేరు నోబెల్ శాంతి బహుమతికి కూడా రెండు సార్లు సిఫార్స్ అయింది.
ఢిల్లీ-హర్యానా బార్డర్ చలిలో రోడ్ల మీద కూర్చుని దాదాపు రెన్నెళ్లుగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారని వారికి మద్దతు తెలపండని ఇలాంటి వ్యక్తి ట్విట్టర్ వేదిక మీది నుంచి ప్రపంచప్రజలను కోరారు.
అంతకు ముందు పాప్ సెలెబ్రిటీ రిహాన కూడా మద్దతు తెలిపారు. దీనితో ఈ సమస్య అంతర్జాతీయంగా రచ్చఅయింది. దీనిని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది.
దీని వెనక ఫోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనే కెనడా దేశం పు సంస్థ ఉందని ఆరోపిస్తున్నది. ఈసంస్థ ఖలిస్తాన్ అనకూలసంస్థ అని, భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ సంస్థ సెలెబ్రిటీలను ఉపయోగించుకుంటూ ఉందని భారత ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తున్నది.
గ్రేటా థున్ బర్డ్ తన ట్వీట్ పాటు ఒక ‘టూల్ కిట్’ (toolkit) ను కూడా షేర్ చేసింది. ఇది భారత ప్రభుత్వానికి ఏమాత్రం నచ్చలేదు. ఇపుడు టూల్ కిట్ షేర్ చేస్తున్నవారిని, దానిని తయారు చేసిన వారిని పోలీసుల అరెస్టు చేస్తున్నారు. పోలీసుల టార్గెట్ లో ఉన్న వాళ్లంతా మహిళలే. ఇందులో భాగంగా ఆదివారంనాడు బెంగుళూరుకు చెందిన మహిళా పర్యావరణ వాది దిశారవిని అరెస్టు చేశారు. ముంబాయికి చెందిన మహిళా న్యాయవాది నికితా జేకాబ్ కి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మరొక మహిళ కోసం గాలిస్తున్నారు.
టూల్ కిట్ అంటే ఏమిటి?
గొడవంతా టూల్ కిట్ చుట్టూ నడుస్తూఉంది. టూల్ కిట్ ను ఎవరు తయారు చేశారు, ఎవరు మొదట షేర్ చేశారు, ఎవరెవరూ దీనికి కాంట్రిబ్యూట్ చేశారనే విషయాలను పోలీసులు కనుగొంటున్నారు.
టూల్ కిట్ (Toolkit) అంటే ప్రమాదకరమయిన వస్తువులు దాచిన సంచిలాగా అనిపిస్తుందిపైకి. అలాంటిదేమీ కాదు, ఇదొక గూగుల్ డాక్యుమెంట్ మాత్రమే. ఇంకా స్పష్టంగాచెబితే ఒక వ్యాసం మాత్రమే.
ఏదేని ఒక సమస్య గురించి వివరించే వ్యాసం. ఈ సమస్యను పరిష్కరించేందుకు , అర్థం చేసుకునేందుకు , పరిష్కారంలో భాగస్వామి అయ్యేందుకు ఏంచేయాలో వివరించే వ్యాసం మాత్రమే.
ఉదాహరణకు సొంతంగా ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏంచేయాలో వివరించే వ్యాసాన్ని టూల్ కిట్ అని పిలవ వచ్చు. డిమ్యాట్ అకౌంట్ ఎలా ఒపెన్ చేయాలని చెప్పే వ్యాసాన్ని టూల్ కిట్ అని పిలవవచ్చు. ఇలాగే తెలంగాణలో ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని కోటి వృక్షార్చన పేరుతో జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి, ఈ కార్యక్రమాన్ని ఎలా ప్రచారం చేయాలి, మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. ఎలా నాటాలి,మొక్కలని ఇతరుకు ఎలా అందించాలి… ఇలాంటి వివరాలను విడుదలచేస్తే, దాన్నిటూల్ కిట్ అనవచ్చు. ఇలాగే నిరసన ఉద్యమాలలో సంఘీభావం తెలిపేందుకు ఏం చేయాలో వివరిస్తూ కొన్ని ప్రకటనలు జారీ చేస్తుంటారు. అదే టూల్ కిట్.
గ్రేటా థున్ బెర్గ్ ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఎలా సంఘీభావం తెలిపాలి,ఎలా బలపర్చాలి, విస్తరింపచేయాలనే వివరాలున్నవ్యాసాన్ని (డాక్యుమెంట్ )ని షేర్ చేశారు. ఈ డాక్యుమెంటు లో రకరకాల మార్గాలు సూచించారు కాబట్టి దానిని టూల్ కిట్ పిలిచారు.
“A toolkit is a document created to explain any issue. It also provided information on what one needs to do to address the issue. This might include information about petitions, details about protests and mass movements, and so on.”
గ్రేట్ థున్ బెర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ లో ఢిల్లీ రైతు ఉద్యమం ఏమిటి, ఎందుకు, ఎప్పటినుంచి మొదలయింది, దీనికి మద్దతు తెలపాలంటే ఏంచేయాలి …అనే విషయాలున్నాయి.
చాలా రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ఉధృతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ఇందులో రాశారు.ఢిల్లీ రైతుల ఉద్యమానికి ఎవరైనా మద్దతు తెలియచేయాలనుకుంటే ఎలా చేయవచ్చో ఈ టూల్ కిట్ డాక్యుమెంటులో రాశారు. విపరీతంగా ట్వీట్లు షేర్ చేసి ఒక ట్విట్టర్ తుఫాన్ సృష్టించడం ఇందులో ఒకటి. ఈటూల్ కిట్ ను రాసిన వాళ్లు, ఎడిట్ చేసిన వాళ్లు, షేర్ చేసిన వాళ్లు ఉన్నారు.వాళ్ల ఇమెయిల్ ఐడిలను, యుఆర్ ఎల్ లను,ఇతర సోషల్ మీడియా అకౌంట్లను భారత ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలనుంచి సేకరించింది.
దిశారవి పాత్ర ఏమిటి?
ఈ టూల్ కిట్ డాక్యుమెంట్ ను దిశారవి ఎడిట్ చేశారు. అంటే రెండు వ్యాక్యాలు కలపడమో, తీసేయడమో, మార్పు చేయడమే చేశారు. ఈ కారణంగా ఆమె ను డాక్యుమెంట్ తయారీ కుట్రలో చాలా కీలకమయిన వ్యక్తి అని పోలీసులుచెబుతున్నారు. వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, ఈ డాక్యుమెంట్ ను రూపొందించడాన్ని ఆమె సమన్వయం చేశారని ఆరోపణ. డ్రాఫ్ట్ కాపీ ఆమెయే తయారుచేశారని అంటున్నారు.
దిశా రవి ఎవరు?
దిశా రవి బెంగళూరుకు చెందిన పర్యావరణ వాది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా (Fridays for Future India) అనే సంస్థను 2018లో ఏర్పాటుచేశారు. ఇందులో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రభుత్వాలు ఆశించినంతగా చర్యలు తీసుకోవడం లేదనేది ఆమె విమర్శ. ఈవిషయాల మీద ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో విద్యనభ్యసించారు.
దిశా రవి అరెస్టు దేశంలో ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి పెద్ద ఎత్తున ప్రముఖలు, రాజకీయ నేతలు పార్టీలు విమర్శించారు. ఇది నిరసన వెల్లువ సృష్టించింది.
Completely atrocious! This is unwarranted harassment and intimidation. I express my full solidarity with Disha Ravi. https://t.co/bRJOeC9MnK
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 14, 2021
Is Disha Ravi, 21 year old climate activist a bigger threat to national security than the son of a top security figure with cabinet rank who has Pakistani & Saudi partners for his business?
— Swati Chaturvedi (@bainjal) February 14, 2021