ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు 67 మంది ఒకేసారీ రాజీనామా చేసి ఆధునిక భారత దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో వారు ఇలా పదవులను తృణ ప్రాయంగా వదిలేసుకున్నారు. పార్లమెంటు నుంచి ఏడుగురు ఎంపిలు కూడా రాజీనామా చేశారు.
ఇపుడు కూడా విశాఖ ఉక్కును కాపాడుకుంటమాని పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు ప్రకటనలు చేస్తున్నారు. వారు విశాఖ ఉక్కును కాపాడుకునేందు ఇలా మూకుమ్మడిగా పదవీ త్యాగాలు చేసేందుకు ముందుకు వస్తారా? ఇప్పటీ వరకు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే రాజీనామా చేశారు. ఇంకా ఎవరూ ముందుకు రాలేదు.
ఈ సమయంలో 1966 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో గుర్తు చేసుకోవడం సమంజసం.
1966 నవంబర్ విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని జోరుగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఈ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అపుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి. వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే పడేది కాదు.
విశాఖలో ఉక్కు కర్మాగారం రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాసు ప్రభుత్వం మీద అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. విశాఖ విద్యార్థి ఉాద్యమం మీద పోలీసులు అనవసరంగా కాల్పులు జరిపి 32 మంది పొట్టను పెట్టుకున్నందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సమ్మతించక పోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
శాసన సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటి మీద వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పై ఉమ్మడిగా ఆవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. చర్చ అనంతరం ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కు రాజీనామ లేఖ అందచేశారు. మొత్తంగా 52 మంది ఉభయ కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, 15 మంది ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యలు రాజీనామా చేశారు.
1966 నవంబర్ 17న శాసన సభలో ప్రశ్నోత్త రాల సమయం ముగియగానే అవిశ్వాసం తీర్మానం విషయం పరిశీలనకు వచ్చింది. తీర్మానానికి అనుకూలంగా 60 మంది సభ్యులు లేచి నిలబడగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు స్పీకర్ అనుమతించారు. తీర్మానాన్ని సిపిఐ (ఎం) నాయకుడు తరిమెల నాగిరెడ్డి, సిపిఐ నాయకులు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, నేషనల్ డెమోక్రట్ల నాయకుడు తెన్నేటి విశ్వనాథం, స్వతంత్ర పార్టీ నాయకులు గౌతు లచ్చన్న, ఇండిపెండెంటు సభ్యుడు వావివాల గోపాలకృష్ణయ్య , ఎస్ ఎస్ సి సభ్యుడు టికె ఆర్ శర్మ సంయుక్తంగా ప్రతిపాదించారు.
తీర్మానం మీద తరిమెల నాగిరెడ్డి ప్రసంగం:
“… కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు ఈ (కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం) ప్రభుత్వం ద్రోహం చేసింది. పైగా విశాఖపట్నం, విజయనగరం, ఆముదాల వలస,పలాస, కాకినాడ, విజయవాడ, మచిలీ పట్నం, జగిత్యాల, సీలేరు, వరంగల్, గుంటూరులలో శాంతియుతంగానూ, నిరాయుధులుగా ఉన్న ప్రజలపై నిర్హేతుకంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా 32 మంది మరణానికి, వందలాది మంది క్షతగాత్రు లయ్యేందుకు కారణమైంది. అంతేగాక, వేలాది మంది గాయపడేలా లాఠీ చార్జీలు జరిపించింది. విస్తృతంగా అరెస్టులు సాగించి అలా నిర్బంధించిన వారిలో కొందరిపై చిత్ర హింసలు సాగించింది. సాధారణ పరిస్థితులు ఏర్పడటాన్ని నివారిస్తూ నిషేధాజ్ఞలు విధించింది. గురిపెట్టిన తుపాకులు చేతపట్టిన సైనికులచే కవాతు చేయిస్తున్నది. కాల్పులపై అనేక పట్టణాలలో తక్షణమే న్యాయ విచారణకు ఉత్తర్వులు ఇవ్వాలి… న్యాయవిచారణ మేం అడిగాం. మీరు నిరాకరించారు. అందుచేత రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. దానికి నిరాకరించారు. అందుచేతనే ఈ అవిశ్వాస తీర్మానం,” అని తరిమెల నాగిరెడ్డి ప్రసంగం ముగించారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమాధానం మిచ్చారు. తర్వాత ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శాసన సభలోని 67 మంది ప్రతిపక్ష సభ్యులు రాజీనామా చేశారు.
రాజీనామా సమర్పించిన సిపిఎం సభ్యులు
తరిమెల నాగిరెడ్డి (పుట్లూరు), పుచ్చలపల్లి సుందరయ్య(గన్నవరం),గుంటూరు బాపనయ్య (నిడుమోలు), తమ్మిన పోతరాజు ( విజయవాడ ఉత్తరం), మండే పిచ్చయ్య (పాయకరావు పేట ఎస్. సి), ఎస్ ఆర్ దాట్ల (అత్తిలి), గంజి రామారావు (గుడివాడ ఎస్ సి), కొరటాల సత్యన్నారాయణ (రేపల్లె), ఈవూరి సుబ్బారావు (కూచినపూడి), కొమ్మినేని వేంకటేశ్వరరావు (బాపట్ల), నరహరి శెట్టి వెంకటస్వామి( పర్చూరు), సూదనగుంట సింగయ్య (అమ్మనబ్రోలు), తవనం చెంచయ్య (సంత నూతలపాడు ఎస్ సి), ఎపి వజ్రవేలు శెట్టి ( కుప్పం), సికె నారాయణరెడ్డి (పీలేరు), కెఎల్ నరసింహారావు (ఎల్లెందు), పర్సా సత్యనారాయణ (పాల్వంచ), కంగల బుచ్చయ్య (బూర్గం పహాడ్), ఎ వెంకటేశ్వరరావు (నర్సంపేట), కె రాఘవులు , ఉప్పల మల్చూర్ (సూర్యాపేట ఎస్ సి), నంద్యాల శ్రీనివాస రెడ్డి సిపిఎం అనుబంధ సభ్యులు, (నకిరేకల్). మధ్యే వాద కమ్యూనిస్టు ఎమ్మెల్యే డి.సీతారామయ్య(మదన పల్లి).
రాజీనామా చేసిన సిపిఐ సభ్యులు
పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (నందిగామ), వేములపల్లి శ్రీకృష్ణ (మంగళగిరి), కె నాగయ్య (గుంటూరు 1), పి కోటేశ్వరరావు (పెద్దకాకాని), జెఎల్ ఎన్ చౌదరి (చీరాల), పి వి శివయ్య (వినుకొండ), పి రంగనాయకుడు (అద్దంకి), వెల్లంకి విశ్వేశ్వరరావు ట( మైలవరం), మైనేని లక్ష్మణ స్వామి ( కంకిపాడు), వంకా సత్యన్నారాయణ ( పెనుగొండ), ఎ సర్వేశ్వరరావు (ఏలూరు), పి శ్యామసుందరరావు (అచెంట), కె బాబూరావు ( పోలవరం), పి పనసారామన్న (అనపర్తి), కె గోవిందరావు( అనకాపల్లి), పివి రమణ (కొండకర్ల), స్వర్ణ వేమయ్య( బుచ్చిరెడ్డి పాలెం ఎస్ సి), కె గురుస్వామిరెడ్డి (కనిగిరి), ఆరుట్ల రామచంద్రారెడ్డి (భువనగిరి), ధర్మభిక్షం ( నల్గొండ), కె రామచంద్రారెడ్డి ( రామన్న పేట), కె పర్వత రెడ్డి (పెద్దవూర), వై పెద్దయ్య (దేవరకొండ), విఠల్ రెడ్డి( నర్సాపూర్), ఎన్ పివి మోహన్ రావు ( ఘన్ పూర్), ఎన్ గిరిప్రసాద్ (ఖమ్మం), మహ్మద్ తహశీల్ (భద్రాచలం), పూలసుబ్బయ్య (ఎర్రగొండపాలెం), శ్రీమితి ఆరుట్ల కమలా దేవి( ఆలేర్), శ్రీమతి కె ఆనందాదేవి (మెదక్ )
స్వతంత్ర పార్టీ అభ్యర్థులు
గౌతు లచ్చన్న ( సోంపేట), పి. రాజగోపాల్ నాయుడు ( తవణం పల్లె), వైసి వీరభద్ర గౌడ్ ( ఎమ్మిగనూర్), ఎస్ అప్పలనాయుడు ( గొలుగొండ), పి నారాయణ రెడ్డి ( మైదుకూరు), ఎస్ పెంచలయ్య ( కోడూరు ఎస్ సి), సిడి నాయుడు (చిత్తూరు), ముత్యాల వలస పాత్రుడు.
నేషనల్ డెమోక్రట్స్
తెన్నేటి విశ్వనాథం (మాడుగుల), ముద్రగడ వీర రాఘవరావు (ప్రత్తిపాడు)
ఎస్ ఎస్ సి
టికెఆర్ శర్మ ( కర్నూల్ )
స్వతంత్ర సభ్యులు
డాక్టర్ బివిఎల్ నారాయణ (ఒంగోలు), వావిలాల గోపాలకృష్ణయ్య (సత్తెన పల్లి)
రాజీనామా చేసిన సిపిఎం లోక్ సభ సభ్యలు
కొల్లా వెంకయ్య (తెనాలి), మాదల నారాయణ స్వామి(ఒంగోలు), పి లక్ష్మీదాస్ ( మిర్యాల గూడు (ఎస్ సి)
రాజీనామా చేసిన సిపిఐ లోక్ సభ సభ్యులు
వీరమాచనేని విమలాదేవి (ఏలూరు), గుజ్జుల యలమందారెడ్డి( మార్కాపూర్), ఎద్దుల ఈశ్వర్ రెడ్డి(కడప), రావి నారాయణరెడ్డి (నల్గొండ)