హైదరాబాద్ లో పెట్రోలు ధర ఇలా పెరిగింది…

దేశంలో ఇంధనం ధ‌ర‌లు వ‌ర‌స‌గా ఏడో రోజు కూడా పెరిగాయి. సోమవారం నాడు పెట్రోలు సగటున 27 పైసలు పెరిగింది. డీజిల్ లీటర్ 32 పైసలు పెరిగింది

ఒక నెల రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రోల్  డీజిల్ ధరలు జనవరి 6వ తేదీ నుంచి పెరగడం మొదలయింది. గ్లోబల్  ముడి చమురు ధరలు పెగడం, కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తున్న ఉత్సాహం రెండూ కలిపి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నాయి.

దేశంలో లీట‌రు పెట్రోలు రూ.90 దాటింది. హైదరాబాద్‌లో లీట‌రు ధరలు పెట్రోల్ రు. 92.53, డీజిల్ రు.86.55 లకు చేరాయి.

నిన్న ఈ ధర రు 92.26పైసలుండింది.మొన్నఅంటే ఫిబ్రవరి 13న  రు 91.96 పైసలుండింది. ఫిబ్రవరి 12న రు.91.65, ఫిబ్రవరి 11న రు. 91.35, ఫిబ్రవరి 10న రు. 91.09, ఫిబ్రవరి 09న రు. 90.78 పైసలు,  ఫిబ్రవరి 08న  90.42 పైసలుండింది. ఫిబ్రవరి 7న రు. 90.42 పైసలు, ఫ్రిబ్రవరి 6న రు.90.42 పైసలు. అంటే గత పదిరోజులలో కేవలం మూడు రోజులు నిలకడగా ఉండిండి. ఏడు రోజులుగా పెరుగుతూ ఉందన్నమాట.

దేశ వ్యాపితంగా తీసుకుంటే  పెట్రోల్ ధర లీట‌రుకు 23 నుంచి 27 పైసలు, డీజిల్ ధ‌ర‌ 28 నుంచి 30 పైసలే పెరిగింది. మ‌ధ్య పెరిగింది. సోమవారం నాడు ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధర రూ.88.73కు,  డీజిల్ ధ‌ర‌ లీటరుకు రూ.79.35కు చేరింది.

గత ఏడు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.06 , డీజిల్ రూ.2.56 పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కిసంబంధించి లీట‌రు పెట్రోల్ రు. 95.13, డీజిల్ రు. 88.63కి చేరుకున్నాయి. ముంబైలో లీట‌రు పెట్రోలు‌ రు .95.46, డీజిల్ రు.86.34గా ఉంది. కోల్‌కతాలో లీట‌రు పెట్రోల్  రు. 90.25, డీజిల్ రూ.82.94కి చేర‌గా, చెన్నైలో  లీట‌రు పెట్రోల్ రూ.91.19, డీజిల్ రూ.84.44కు చేరుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *