వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనా వైరస్ భయం తగ్గిపోతూండటం బంగారు మీద ప్రభావం చూపింది. ఈ రోజు బంగారు ధర నిలకడగా ఉంది. సోమవారంనాడు బంగారు పది గ్రాముల ధర రు. 47,318 దగ్గిర స్థిరపడింది. గత వారంలో బంగారు ధర పది గ్రాముల మీద రు. 800 తగ్గిన సంగతి తెలిసిందే.
అమెరికా లో బైడెన ప్రభుత్వ వచ్చినప్పటినుంచి బంగారు ధర తగ్గుతూఉంది. ఈ ఏడాది ఇంతవరకు బంగారు ధర 4 శాతం పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర 0.1 శాతం తగ్గి $1,823.25 కి చేరింది. బంగారు ధర తగ్గిపోతే, మరొక వైపు వెండివంటి ఇతర లోహాల ధరలు పెరిగాయి.
అయితే, బంగారు ఇంతకంటే పడిపోక పోవచ్చని, డాలర్ బలహీనంగా ఉన్నందున బంగారు ఔన్స్ ధర 1,800 డాలర్ల నుంచి 1900 డాలర్ల మధ్య స్థిరపడుతుందని నిపుణులు చెబుతున్నారు.