జిహెచ్ ఎంసి మేయర్ గా ఎన్నికయిన కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మిని ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఈ రోజు జరిగిన ఎన్నికలో ఆమె బిజెపి అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి మీద గెలుపొందారు.
నిజానికి ఇది నామమాత్రం పోటీయే.డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. టిఆర్ ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది.
రాజ్య సభసభ్యుడు కె కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.