విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూనే మొదట గుర్తుకొచ్చే పేరు తెన్నేటి విశ్వనాథం (1895-1979).తెలుగు నాట స్వాతంత్యోద్యమం తర్వాత ఉవ్వెత్తున లేచిన పోరాటం విశాఖ ఉక్కు పోరాటమే. తెలుగునాట ప్రతిఇంటిని తాకిన నినాదం ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అనే నినాదం. స్టీల్ ప్లాంట్ కావాలని పట్టబట్టి మొదట అసెంబ్లీకి రాజీనామా చేసింది కూడా. ఆయనే కాదు, స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకులున్నారని, నీలం సంజీవరెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నారని తెన్నేటీ బాహాటంగా విమర్శించారు.
తెన్నేటి విశ్వనాథం 1895లో విశాఖ పట్నం జిల్లాలోని లక్కవరంలో జన్మించారు. మద్రాసులో బిఎ, ఎంఎ చదివారు. త్రివేండ్రంలో న్యాయశాస్త్రం చదివారు. గాంధీతో ఉత్తేజితుడై జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విడ్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1937లో మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1951లో మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. విశాఖపట్నం నియోజకవర్గం నుంచి నాలుగో లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర క్యాబినెట్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన గొప్ప వక్త.రచయిత కూడా.
2005 నవంబర్ 10 న ఆయన జ్ఞాపకార్థం రు.5 పోస్టల్ స్టాంపును విడుదలచేశారు. 1951లొ కాంగ్రెస్ పార్టీ ని వదిలేశారు. ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుచేశారు. అపుడే కాంగ్రెస్ పార్టీ పతనమవుతూ ఉందని ప్రకటించారు. నెహ్రూ ఈ పార్టీనికి బతికించలేరని కూడా అన్నారు. Don’t you see, even Nehru cannot breathe life into a dying and disintegrating Congress Party. We have to start afresh with a new party and a new mission. That is why I started the Praja Party,” అని ఆయన ప్రజాపార్టీ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే, ప్రజాపార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా, నెహ్రూ తెన్నేటిని వదులుకోదలుచుకోలేదు. ఆయని కాఫీ బోర్డు చెయిర్మన్ గా నియమించారు. అరకు వ్యాలీలో కాఫి ప్లాంటేషన్స్ అభివృద్ధి చేసేందుకు అపుడు తెన్నేటి తీవ్రంగ కృషి చేశారు.
1963లో నాటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం ఆంగ్లో అమెరికన్ బృందం సిఫారసు మేరకు 5వ ఉక్కు కర్మాగారం విశాఖలో నిర్మించడానికి హామీ ఇచ్చారు.
అపుడు దేశంలో ఐదో ఉక్కు కర్మాగారం కోసం కర్నాటక, మద్రాసు, ఆంధ్ర ప్రదేశ్ పోటీపడుతున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప, ఎఐసిసి అధ్యక్షుడు కామరాజ్ స్టీల్ ప్లాంట్ ను తమ రాష్ట్రాలకు కేటాయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈవిషయం తేల్చేందుకు ఈ ఆంగ్లో అమెరికన్ కన్సార్సియం మూడు రాష్ట్రాల పరిస్థితులను అధ్యయంన చేసి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు విశాఖ పట్టణం అనువైనది సూచించింది.
1966 వరకూ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఠా తగాదాలే నని చెబుతారు. అప్పడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వర్గాల మధ్య వర్గ పోరు భీకరంగా సాగుతూఉంది. 1966 సెప్టెంబర్ 27 హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేరు పెట్టకుండా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేలేదని ప్రధాని ఇందిరాగాంధీప్రకటించడం ఉద్యమానికినిప్పురాజేసిందిన
ఈ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతానికి బాగా ఉద్యోగాలొస్తాయి. ప్రాంతీయాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే, కేంద్రం నిధులు లేవనే పేరుతో జాప్యం చేస్తూ ఉంది. అంతేకాదు, ఈ కర్మాగారాన్ని తమిళ నాడుకో కర్నాటకకో తీరలించుకు పోతారనే భయం కూడా మొదలయింది. ఈ నేపథ్యంలో ఉక్కు కర్మాగారాన్ని విశాఖలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ బాగా ఉధృతమయింది.
సంజీవరెడ్డి స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నారని తెన్నేజీ ఆయన పేరుపెట్టి విమర్శంచారు.
మొట్టమొదట విశాఖస్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చినపుడు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, తర్వాత ఆయన కేంద్రంలో స్టీల్ మంత్రిగా ఉన్నారు. అపుడు సంజీవరెడ్డి విశాఖలో స్టీల్ ప్లాంట్ వచ్చేందుకు ఏమీ చేయ లేదనేది ఆయన మీద పార్టీ ప్రముఖులే కాదు, తెన్నెటి వంటి కాంగ్రెసేతర నేతలు కూడా చేసే విమర్శ. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కూడా సంజీవరెడ్దిని విమర్శించారు.
ఇందిరా గాంధీ విశాఖ వచ్చినప్పుడు స్వయంగా కలసి తెన్నేటి విశాఖస్టీల్ ప్లాట్ గురించి వివరించారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఆందోళన మొదలుపెట్టారు. కర్మాగారం ఏర్పాటుచేస్తేనే ఉద్యమం విరమిస్తామన్నారు.
తెన్నేటి పిలుపు మేరకు యావదాంధ్ర ప్రదేశ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో మారు మోగిపోయింది. ఊరూ వాడా సభలు, సమావేశాలు, ఆందోళనలు విజృంభించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెన్నేటి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలా ఆయన విశాఖ ఉక్కుకోసం రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేఅయ్యారు.
1967లో అసెంబ్లీ, విశాఖ లోక్ సభ స్థానాలు రెండింటికి పోటీ చేసి గెలుపొందారు. విశాఖ అసెంబ్లీ 1 నుంచి ఆయన ఇండిపెండెంటుగా పోట చేసి కాంగ్రెస్ అభ్యర్థి విబి అంకితం మీద 14715 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అయితే, తన లక్ష్యం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయడం కాబట్టి లోక్ సభ సభ్యుడిగా కొనసాగాలనుకున్నారు. లోక్ సభ నుంచి తన పోరాటం కొనసాగించారు.
ఆందోళన మరింతగా పెరగడంతో విశాఖ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఉద్యమ కారులు పోలీసు కాల్పుల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ఉక్కు కార్మాగారం విషయంలో తెన్నేటి జరిపిన ఆందోళన కారణంగా 1970 ఏప్రిల్‌లో ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణానికి సమ్మతిస్తూ ప్రకటన చేశారు. ఆ వార్త యావదాంధ్ర దేశాన్ని ఆందోత్సాహాలతో నింపింది. ఆపై 1971లో తెన్నేటి సమక్షంలో ఆమె ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ అసలు నిర్మాణం 1982 ఫిబ్రవరి 18న మొదలయింది. 1979 నవంబర్ 10 న విశాఖలో ఇంటి కన్నుమూశారు.
కలువరింతలు పేరుతో ఆయన కవిత సంకలనం వెలువరించారు. నాజీవనం, యాజ్ఞవల్క్య అనే నాటకాలు రాశారు. ఇంగ్లీష్ Rama’s Exile అనే పుస్తకం రచించారు.