విశాఖ ఉక్కు కాపాడుకునేందుకు తిరుపతిలో ‘గోవిందా!’ నిరసన

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించినా, తరలించినా ఆంధ్రా  ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని రాయలసీమ  పోరాట సమితి , ఐ ఎన్ టి యు సి నేతలు  డిమాండ్ చేశారు.

పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు సంస్థల సభ్యులు తిరుపతిలో నిరసన ప్రదర్శన చేశారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మే విధానంతో భారతీయ  జనతా పార్టీ ప్రభుత్వం దూసుకుపోతున్నదని,దీనికి అడ్డుకట్టే వేసేందుకు  రాజకీయ పార్టీలు ఉద్యమించాలని  నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ కు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే,  బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ఉత్తరప్రదేశ్ కు తరలించే కుట్ర చేస్తున్నదని ఆయన అన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను తరలించే ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ ప్రకటన చేసేలా మన ఎంపీలు పార్లమెంటును స్తంభింప చేయాలని ఆయన  ఆంధ్రప్రదేశ్ ఎంపిలకు విజ్ఞప్తి చేశారు.


“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” కాంగ్రెస్ నినామయితే “విశాఖ ఉక్కు ప్రైవేట్ హక్కు” అనే దాన్ని బిజెపి నినాదంగా చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

“మన్నవరం బెల్ ఫ్యాక్టరీ గుజరాత్” కు “గోవిందా”, ) “పేదల కోసం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన 7వేల ఇండ్లు” గోవిందా”  “అంతర్జాతీయ విమానాశ్రయం” “గోవిందా” ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం “గోవిందా”,  దుగరాజపట్నం ఓడరేవు”గోవిందా”  “భారతదేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు” గోవిందా” అంటూ వారు నినాదాలు చేస్తూ  తిరుపతి వెంకన్న పటం చేత పట్టి ప్రదర్శన చేశారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానాలు చేశారు అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేయడం “దేశద్రోహం అని
బిజెపి ప్రభుత్వం ఇప్పటికే పోస్టల్,టెలికాం,రైల్వేస్, విమానయానం,ఎల్ఐసి, భారత్ పెట్రోలియంలతో పాటు విశాఖ ఉక్కును ప్రైవేట్ సంస్థలకు అమ్మేందుకు రంగం సిద్ధమయిందని, ప్రజలు అప్రమత్తం కాకపోతే, ఇంకా పెద్ద పెద్ద ముప్పులు వస్తాయని నవీన్ అన్నారు.

బీజేపీ తీరు “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని, ) బిజెపి పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు “వెలవెలబోతున్నాయి” ప్రైవేటు రంగ సంస్థలు “కళకళలాడుతుండటంలో రహస్యమిదేనని నవీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను “తూకం వేసి” అమ్మే హక్కు బిజెపికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు

” కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అధికార ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి,
పార్లమెంటులో ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు విశాఖ ఉక్కు తరలింపుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేలా మంచి బుద్ధిని ప్రసాదించు,” అని ఆయన పేర్కొన్నారు.

ప్రదర్శనలో ఎఐసిసి సభ్యులు ప్రమీలమ్మ , చిన్నా,కేశవ, సురేష్ కలికిరి చిరంజీవి,పూతలపట్టు ప్రభాకర్,రామచంద్ర,వెంకటాద్రి,బాబు,ఖాదర్ తేజోవతి,మునిశోభ,హేమాద్రి, గోపి గౌడ్, కెసి సురేంద్ర, చిన్న స్వామి, విజయశేఖర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *