దారుణం! తెలంగాణలో 11 యూనివర్శిటీలకు విసిలు లేరు, కారణం?

అపుడపుడు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్ లర్ల నియమాకం ఆలస్యమవుతూ ఉంటుంది. ఒకటి రెండు యూనివర్శిటీలకు ఇలా జరిగితే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్శిటీలకు విసిలు లేకపపోతే  ఏమనాలి?

నిజానికి యూనివర్శిటీ విద్యకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాలలో ఇలాంటి ఆలస్యం కూడా జరగడానికి వీల్లేదు.  ఎందుకంటే, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ పదవి రెండు మూడేళ్లకు మాత్రమే జరుగుతుంది. అందువల్ల కొత్త వైస్ చాన్స్ లర్ ఎపుడు అవసరమో తేలిపోతుంది. పదవిలో ఉన్న వైస్ చాన్స్ లర్ రిటైర్ కాకముందే  సెర్చ్ కమిటీి నియమించి వైస్ చాన్స్ లర్ ఎంపిక చేయవచ్చు. వైెస్ చాన్స్ లర్ పదవి ఎపుడూ ఖాళీగా ఉండటానికి వీల్లేదు. ఇంత వెసలుబాటు ఉన్నపుడు విసి నియామకాలు 20 నెలలపాటు జరగ లేదంటే ప్రభుత్వ మేదయినా సరే, కారణ మేదయినా సరే  నిజాయితీని శంకించాల్సిందే.

ముఖ్యంగా  ప్రత్యేక రాష్ట్రంగా  అవతరించి, బంగారు తెలంగాణగా మారుతున్న ఒక రాష్ట్రంలో ఇలాంటిది అసలు జరగడానికి వీల్లేదు.

ముఖ్యమంత్రి కెసిఆర్, మేధావిగా గుర్తింపు ఉన్న నేత

ఐఎఎస్ ల పాలనలో విశ్వవిద్యాలయాలు

ఆశ్చర్యంగా తెలంగాణలోనే ఈ  పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కు మేధావి అని పేరుంది. మేధావి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో ఇలా  జరగడమే ఆశ్చర్యం.

రాష్ట్రంలో 11 యూనివర్శిటీలకు వైస్ చాన్స్ లర్లు లేక 20 నెలలు అవుతూ ఉంది.  2019 జూలై 24  వైెస్ చాన్స్ లర్ల పదవీ కాలం ముగిసింది. ఇంతవరకు వైెస్ చాన్స్ లర్లు నియామకాలు జరగలేదు. రాజీవ్ గాంధీ యూనివర్శిటీస్ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ కు ,శాతవాహన  విశ్వవిద్యాలయానికి 2015 నుంచి వైస్ చాన్స్ లర్ లేరు. ఈ పరిస్థితి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మీడియా వార్తలొస్తున్నాయి.

Tamilisai Soundararajan, Governor, TS

ఇపుడు ఈ విశ్వవిద్యాలయాలన్నింటికి ఐఎఎస్ అధికారులు విసిలుగా ఉంటున్నారు.  వీరంతా సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు. వీళ్లకు ప్రభుత్వ పాలనా బాధ్యతలే ఎక్కువ. అలాంటపుడు విశ్వవిద్యాలయాల మీద దృష్టి ఎలా కేంద్రీకరిస్తారు. కొందరికి  రెండేసి యూనివర్శిటీలను అప్పగించారు.

ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి  మునిసిల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ఇన్ చార్జ్ విసిగా ఉన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయానికి  టి.  చిరంజీవి, కాకతీయ యూనివర్శిటీకి మరొక ఐఎఎస్ అధికారి బి జనార్ధన్ రెడ్డి ఇన్ చార్జ్ లు ఉన్నారు. పాలమూరు, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్శిటీలకు  ఎస్ సి డెవెలప్ మెంట్ డిపార్టమెంట్ కార్యదర్శి బొజ్జా రాహుల్ ఇన్ చార్జ్. తెలంగాణ యూనివర్శిటీకి, పొట్టి శ్రీరాములు యూనివర్శిటీకి  నీతు కుమారి ప్రసాద్ ఇన్ చార్జ్ విసిగా ఉంటున్నారు. ఇక మిగతా వాటికి సంబంధించి ఐఎ ఎస్ అధికారలు వికాస్ రాజ్ (అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ),జయేష్ రంజన్ (జెఎన్ టియు),  స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారామచంద్రన్ ( జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం)విసిలుగా ఉంటున్నారు.

వైస్ చాన్స్ లర్ లేకపోతే, ఏమవుతుంది?

యూనివర్శిటీ పాలకుడు వైస్ చాన్స్ లర్. ఒకపుడు వైస్ చాన్స్ లర్ ను కలవడానికి ముఖ్యమంత్రులు ఇబ్బంది పడే వారు. ఎందుకంటే వాళ్లు చాలా మేధావులు, జాతీయంగా అంతర్జాతీయంగా అకడిమిక్ రంగంలో ప్రతిష్ట పొందిన వారు.  ప్రతిభ మీద వైస్ చాన్స్ లర్లు అయిన వారు. వాళ్లు రాజకీయ నాయకులును కలుసుకోవడం, రాజకీయ నాయకులు వచ్చి వాళ్లని కలుసుకోవడం జరిగేది కాదు.

అందుకే ఆ రో వైస్ చాన్సరల్ కాలం లో రాష్ట్రంలో ని విశ్వవిద్యాలయాలు స్టాండర్డు చాలా బాగుండేది. ఇపుడు మన యూనివర్శిటీల స్టాండర్డ్స్ పాతాళంలో ఉన్నాయి. రెగ్యులర్ వైస్ చాన్స్ లర్ ఉన్నపుడే యూనివర్శిటీల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకాలు జరుగుతాయి. ఈ నియామకాలు జరగకపోతే, యూనివర్శిటీ నడవదు. రీసెర్చ్ ఆగిపోతుంది. అంతేకాదు, నిధులు కూడా ఆగిపోతాయి.

రాష్ట్రంలో ఒక వైపు నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం దాదాపు తెలంగాణ ఉద్యమం సాగిస్తున్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు.ఈ టర్మ్ లో జరగకపోతే, ఎదురు ఎదురుచూసి వాళ్లు ఎందుకూ కొరగాకుండా పోతారు.

మరొక వైపు ప్రభుత్వంలో ఉద్యోగాలు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణ యూనివర్శిటీలనే తీసుకుందాం. రాష్ట్రంలో 2000 లకు పైగా  టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నగరం నడిబొడ్డున ఉంటూ, ఒకపుడు తెలుగు వాళ్లందరికీ గర్వకారణమయిన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 840 ఖాళీలున్నాయి. కాకతీయ యూనివర్శిటీలో ఉన్న ఖాళీలు 280, జెఎన్ టి యులో 232, తెలంగాణ యూనివర్శిటీలో  75,మహాత్మాగాంధీ యూనివర్శిటీలో 115, శాతవాహన యూనివర్శిటీలో 100, పాలమూరు విశ్వివిద్యాలయంలో 1130, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 58,పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో 100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితులు యూనివర్శిటీలలో టీచింగ్ ఏముంటుంది, రీసెర్చ్ ఏముంటుంది? ఇక నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలు ఇంతకు రెట్టింపు ఉన్నాయని చెబుతున్నారు.

సెర్చ్ కమిటీ ఏమయింది?

వైస్ చాన్స్ లర్ల నియమాకానికి ఒక ముగ్గురు సభ్యులున్న ఒక సెర్చ్ కమిటీ వేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రతినిధి, యూజిసి ప్రతినిధి కూడా ఉంటారు. సాధారణంగా బయటి విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు  ఈ కమిటీకి ఛెయిర్మన్ గా ఉంటారు. విసి పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ముగ్గురిని ఎంపిక చేసి గవర్నర్ కు పంపిస్తారు. అందులో నుంచి ఒకరిని గవర్నర్ చాన్స్ లర హోదాలో  విసిగా నియమిస్తారు. లోలోపల ఏమిజరిగినా పైకి ఇది ప్రాసెస్.

తెలంగాణ వైస్ చాన్స్ లర్ల ఎంపిక కోసం  2019 సెప్టెంబర్ 24 అంటే, వైస్ చాన్స్ లర్ల పదవీ కాలంలో ముగిసిన మూనెళ్లకు ముచ్చటగా  సెర్చ్ కమిటీల ను నియమించినట్లు వార్త వచ్చింది. ఇది కేవలం కంటి తుడుపుకు మాత్రమే నియమించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే, ఈ సెర్చ్ కమిటి సభ్యులకు తమని నియమించిన విషయం కూడా తెలియదట. వైస్ చాన్స్ లర్ పోస్టులకు ఎన్ని దరఖాస్తులొచ్చాయో కూడా తమకు తెలియదని  సెర్చ్ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇంతవరకు సెర్చ్ కమిటీలు సమావేశమే కాలేదు. 2019 లో ఒక సారి సమావేశానికి తేదీ నిర్ణయించారు. సెర్చ్ కమిటీలకు సహకరించేందుకు ఒక సమన్వయ కమిటీని కూడా నియమించారు. ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి తప్ప  కార్యరూపం దాల్చడం లేదు.  ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

దీనివెనక కారణమేమయి ఉంటుంది?

తెలంగాణలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. ఇపుడు యూనివర్శిటీ విద్య ప్రభుత్వ రంగంలో ఉంది. ఇంజనీరింగ్ , మెడిసిన్ వెళ్లలేని పిల్లలు, అర్ట్స్, హ్యూమానిటీస్ ల విద్యార్థులు యూనివర్శిటీలలో ఉంటున్నారు.

Prof. Sravan Dasoju T-Cong Spokesperson

ఇపుడు ఈ రంగాల్లోకి కూడా కార్పొరేట్ విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. ఈ విద్యార్థులను  కార్పొరేట్ విశ్వవిద్యాలయాలవైపు మళ్లించేందుకు ప్రభుత్వమే విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు అన్నారు. అందుకే విశ్వవిద్యాలయాలకు  వైస్ చాన్స్ లర్లను నియమించడం లేదని, ఇదొక కుట్ర అని ఆయన అంటున్నారు.  విశ్వవిద్యాలయాలలో పిల్లలు చేరడం మానేస్తే, కొంతకాలానికి వాటిని మూసేకపోయినా, సైజు తగ్గించవ్చు. అపుడు  నగరాలలో మధ్యలో ఉన్న  ఈ విద్యాసంస్థలను మరొకచోటికి తరలించి వాటి భూములు విక్రయించవచ్చు బహుశా పాలకులలో ఇలాంటి ఆలోచన ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *