పర్యావరణ వాది గ్రేటా మీద ఢిల్లీ పోలీసుల కేసు

ఢిల్లీ సమీపంలో రెన్నెళ్లుగా ఆందోళన చేస్తున్నరైతులకు మద్దతు తెలిపినందుకు స్వీడెన్ కు చెందిన యువ పర్యావరణవాది గ్రేటా తున్ బెర్గ్ (Greta Thunberg) మీద ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. రైతుల ఆందోళన అంతర్జాతీయ వార్త అయిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్ లో రైతులకు తన సంఘీభావం వ్యక్తం చేసింది.

అంతకు ముందు అంతర్జాతీయ పాప్ స్టార్  రిహాన్నా కూడా రైతులకు మద్దతు తెలిపింది. రైతుల ఆందోళన జరుగుతున్న ప్రాంతాలో భారత ప్రభుత్వం  ఇంటర్నెట్ రద్దు చేయాడాన్ని రిహన్నా నిరసించింది. రిహాన్నా ట్వీట్ తో ప్రపంచవ్యాపితంగా ఢిల్లీ రైతు ఉద్యమానికి అంతర్జాతీయ గర్తింపు లభించింది. నిజానికి ఢిల్లీ రైతులపోరాటం వీళ్ల కంటపడేందుకు కారణం, సిఎన్ ఎన్ రాసిన వార్తలే. వాళ్లు సిఎన్ ఎన్ వార్తలను ఉంటంకించే తన సానుభూతి వ్యక్తం చేశారు.

గ్రేటా ను 2019, 2020 సంవ్సరాలలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

మొదట గ్రేట తన సానుభూతి వ్యక్తం చేశారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని (సెక్షన్ 153A Promoting enmity among different groups on grounds of religion and race), కుట్ర (120B Criminal Conspiracy) చేస్తున్నట్లు కేసు పెట్టారు. భారత విదేశీవ్యవహారాల శాఖ ఈ సెలబ్రెటీ రియాక్షన్ మీద ఖండన జారీ చేస్తూనే   ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.  ఈ సెలెబ్రిటీలంతా సిఎన్ ఎన్ వార్తను జోడించి తమ సానుభూతి తెలిపారు.

పోలీసు ఎఫ్ ఐ తర్వాత గ్రేటా మరొక ట్వీట్ చేస్తూ తన ధోరణి మారదని #StandWithFarmers #FarmersProtest హ్యాష్ ట్యాగ్స్ జోడించి  చెప్పారు.

 

గ్రేటా నిన్నటి టీట్ ఇదే…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *