ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్లో గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీ.ఆర్.వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్వీసులో ఉన్నపుడు అధికారులు వాళ్ల చేత అడ్డమయిన పనులు చేయించుకున్నారు. దీనితో విఆర్వొ వ్యవస్థ బాగా అన్ పాపులర్ అయింది, ప్రజలు అసహ్యించుకునే స్థాయికి వచ్చారు.అన్ని పాపాలువాళ్లమీదికే నెట్టేశారు. ఇంత జరిగాక ముఖ్యమంత్రి కెసిఆర్ విఆర్వో వ్యవస్థ రద్దు అన్నారు. వీఆర్ వో లు రోడ్డున పడ్దారు. వాళ్ల చేత పాపాలు చేయించిన అధికారలు పవిత్రులుగా మిగిలిపోయారు. దీనితో దిక్కుతోచక రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు.
ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్ కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వి ఆర్ వోల ను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని అర్హులైన విఆర్వో లందరికీ సీనియర్ ప్రమోషన్లు ఇయ్యాలని డిమాండ్ చేశారు.
ఇందులో ప్రధానంగా ప్రమోషన్ విషయంలో జిల్లా అధికారులు వీ.ఆర్.వో లను వివక్షకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
రెండు దఫాలు ప్రొమోషన్ల విషయంలో వీ.ఆర్.వోలను విస్మరించారని, వీ.ఆర్.వో వ్యవస్థ రద్దు చేసి 5 నెలలు గడుస్తున్నా వీ.ఆర్.వోల భవిష్యత్తుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 27.01.2021వీ.ఆర్.వోలను విస్మరిస్తూ కేవలం జూనియర్ అసిస్టెంట్లకు కల్పించిన ప్రమోషన్లను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.
వీ.ఆర్.వో వ్యవస్థ రధ్దు అయినందున వీ.ఆర్.వోలను వారి సీనియారిటీకి భద్రత కల్పిస్తూ జూనియర్ అసిస్టెంట్లుగా గాని స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా గాని కన్వెర్ట్ చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల మురళి రాష్ట్ర కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రటరీ రాములు రాష్ట్ర నాయకులు రాజేష్ శ్రవణ్ గౌడ్ జిల్లా నాయకులు శేఖర్, శివ, సుదర్శన్, మహబూబ్ ఖాన్, రామ్ కుమార్ మహిళా నాయకురాళ్లు కృష్ణమారి, అర్చన, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.