మహారాష్ట్ర టీచర్ చొరవ, ఔరంగాబాద్ బెంచ్ అద్భుతమైన తీర్పు

తమ చుక్కలు మందు రహస్యంగా అన్నంలో కలిపితే మద్యపానం మానేస్తారు, తమ హనుమాన్ చాలీసా యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే రోగాలు కుదుర్తాయి, సకల సంపదలు వస్తాయి వంటి పిచ్చిపిచ్చి ప్రకటనలు ఇచ్చే కంపెనీల మీద  వాటిని ఎండార్స్ చేసే  సెలబ్రిటీలు పైన కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్  మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసు, ఈ  చారిత్రాత్మక తీర్పు  ఒక టీచర్ అయిదేళ్ల న్యాయపోరాటం ఫలితం. ఆయన పేరు రాజేంద్ర గణ్ పత్ రావ్ అంభోరే. ఔరంగాబాద్ లో టీచర్. వయసు 45 సంవత్సరాలు.

ఈలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనల మీద (బాబా మంగళ్ నాథ్  చేసిన హనుమాన్ చాలీసా) సమాజానికి హానిచేస్తాయని ఆయన భావించారు. దీని మీద  2015లొ పిటిషన్ (WP 469 of 2015) వేశారు. రిట్ పిటిషన్ విచారించిన తర్వాత   జస్టిస్ తానాజీ వి. నలవాడే, జస్టిస్ ముకుంద్ జి సెవ్లికర్ ల ధర్మాసనం ఈ  ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 5వ తేదీన ఈ తీర్పు వచ్చింది. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వారందరి మీద చేతబడి చట్టం (Black Magic Act) కింద కేసులు నమోదుచేయాలని చెప్పింది. ఇలాంటి పిచ్చిపిచ్చి వ్యాపార ప్రకటనలను నివారించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వమూ ప్రకటనలు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

తమ రుద్రాక్షలకు, మందుచుక్కలకు మహిమలున్నాయని, ఔషధగుణాలున్నాయని చెప్పి ఇలాంటి చిల్లర ప్రకటనలను టివిలలలో ప్రసారం చేయడం కూడా చట్ట వ్యతిరేకమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రకటనలిచ్చేవారినే కాదు, వాటిని ప్రసారం చేసే టివిచానెళ్లను కూడా Maharashtra Prevention and Eradication of Human Sacrifide and other Inhuman, Evil and Aghori Practices and Black Magic Act , 2013   ప్రకారం చర్యలుతీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం కింద నియమించిన విజిలెన్స్ అధికారులు వెంటనే ఈ ప్రకటనలు ఇస్తున్నవారిమీద నివేదికలు తయారు చేసి కేసులు బుక్ చేయాలని ఆదేశించింది.ఇలాంటి వ్యాపార ప్రకటనలు టివిల్లో ప్రసారం  కాకుండా జాగ్రత్త తీసుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేబుల్ నెట్ వర్క్స్  రెగ్యులేషన్ యాక్ట, 1995కింద ఒక కమిటీని నియమించాలని ఆదేశించింది. ఇలాంటి అథారిటీ ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోయి ఉంటే నెలరోజుల్లో ఏర్పాటుచేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

https://trendingtelugunews.com/top-stories/features/hallmarking-mandatory-from-june-1-2021-know-about-gold-hallmarking/

హనుమాన్ చాలీసాయంత్రానికి మానవాతీత,దైవిక, మాంత్రిక శక్తులున్నాయని ఒక టివిచానెల్ వస్తున్న ఒక ప్రకటన చూశాక ఆయన కోర్టులో ఈ పిటిషన్ వేశాడు. ఈ ప్రకటన ప్రకారం ఈ యంత్రాన్ని అమాయకులు అమ్మిసొమ్ము చేసుకునేందుకు ఈ ప్రకటనలు వేస్తున్నారని ఆయన పిటిషన్ లోపేర్కొన్నారు. మనుషుల్లో చాలామందిలో దైవిక శక్తులున్నా, మానవాతీత శక్తులన్న నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని, ఈ ప్రజల అమాయకత్వాన్ని  సొమ్ము చేసుకునే ఇలాంటి యంత్రాలను తయారు చేస్తి  ప్రకటనలు కుప్పిస్తున్నారని, కేవలం డబ్బు వ్యామోహన టివి చానెళ్లు కూడా ఇవి నిజమా కాదా అని విచారించకుండా ప్రకటనలు ప్రసారం  చేస్తున్నాయని రాజేంద్ర గణ్ పత్ రావ్ వాదించారు. ఈ టీచర్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి.

‘జ్యోతీరావ్ ఫూలే, అంబేడ్కర్ వంటి సంస్కర్తలుపుట్టిన నేల ఇది. వారు ప్రజలలోల ఉన్ మూఢ విశ్వాసాలను పొగట్టేందుకు ఎంతో కృషి చేశారు. ఇలాంటి మూఢనమ్మకాలు పోవాలంటే, సార్వజనీన విద్యను ప్రోత్సహించడేమార్గ’మని ధర్మాసనం అభిప్రాయపడింది.

కేంద్ర రాష్ట్రాలు ఈ పిచ్చిపిచ్చి ప్రకటన ల మీద తీసుకున్న చర్యల మీద  30  రోజులలో కోర్టుకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం తన  27 పేజీల తీర్పులో పేర్కొంది.

మంత్రించిన అష్ట లక్ష్మి యంత్రాలను కొనుగోలు చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పిల్లలు లేని వారికి మా లేహ్యం టీలో కలుపుకొని తాగితే పిల్లలు పుడతారని, మద్యం సేవించే వారికి, బీడీలు తాగే వారికి మేము ఇచ్చిన మందు రెండు బొట్లు వారికి తెలియకుండా అన్నంలో కలిపి పెట్టినట్లయితే మద్యం తాగుడు, సిగరెట్లు, బీడీలు త్రాగడం తక్షణమే మానేస్తారని, మోకాళ్ళ నొప్పులు గలవాళ్ళు మా మందు పూసుకుంటే గంటలోనే గోడలు దూకేస్తారని,  హనుమాన్ చాలీసా మంత్రించిన మా తాయత్తు మెడకు చుట్టుకునే హనుమంతుని నెత్తిన ఎక్కించుకున్నత్లెనని, అన్నీ శుభాలే జరుగుతాయని రోజు ప్రకటనలు వస్తుంటాయి.

ఇలాగే  తమ రంగురాళ్లు, సంఖ్యా శాస్త్రాలు, రుద్రాక్షలు, జ్యోతిష్యం ఐశ్వర్యాలు తెస్తాయని, మూలికలు, ఇతర ఆకులు అలములు చూపించి  వ్యాపార ప్రకటనలు కుప్పిస్తుంటాయి.వాళ్లెలా డబ్బుకోసం  ఈ అబద్దాల ప్రకటనలు తయారుచేస్తున్నారో, డబ్బు కోసం టివిచానెళ్లకూ ఈ ప్రకటనలను ప్రసారం చేస్తున్నాయి.

ఇవన్నీ అమాయక ప్రజలను దోచుకోవడానికి, ప్రజల్ని మోసగించడానికి, ప్రజల్లొ మూఢనమ్మకాలను పెంచి పోషించడానికి జరుగుతున్న ప్రచారాలే కనుక, వీటిని ప్రసారం చేసే టీవీలు, సెలబ్రిటీల పైన, వస్తువులను అమ్మవారి పైన మూఢనమ్మకాలు నిర్మూలన చట్టం కింద కేసు బుక్ చేయమని చెప్పడం హర్షదాయకం, అభినందనీయం, ఆరోగ్యదాయకమని జన విజ్ఞాన వేదిక తెలంగాణ, రాష్ట్ర కమిటీ సభ్యులు, సి. రామరాజు వ్యాఖ్యానించారు.

‘మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం పూట ఏ ఛానల్ చూసినా ప్రజల్ని మోసం చేసే ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా రావడం మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ప్రకటన కర్తలు ప్రకటించిన విధంగా డబ్బులు చెల్లించిన అమాయక ప్రజలు వారి విలువైన ధనాన్ని కోల్పోతూ ఎలాంటి ప్రయోజనం లేక మోసపోతూనే ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల  నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేసేలా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,’ అని ఆయన పేర్కొన్నారు.

https://trendingtelugunews.com/top-stories/features/requiem-for-a-grand-old-majestic-wall-clock/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *