నిర్మలా సీతారామన్ అనుకుంటే… ఫ్లాట్స్ రేట్స్ ఇలా తగ్గుతాయి…

కరోనా పాండెమిక్ వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆన్ సైట్ (on-site) పనులను నిషేధించడంతో కూలీలంతా వాళ్ల వాళ్ల వూర్లకు వెళ్లిపోయారు. నిర్మాణ రంగంలో ఉండే కూలీలు మెజారిటీ వలస కూలీలే. కూలీ పనులు లేకపోవడంతో వాళ్లంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సొంత వూర్లకు వెళ్లిపోయారు. ఇది వేరే విషాద గాధ.

అయితే, కుదేలయిన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ఒకటేమార్గం, ప్లాట్ల ధరలు తగ్గాలి.  ధరలు తగ్గితే, ఇల్లు కొనేందుకు ముందుకు రాని పౌరుడెక్కడ ఉంటారు. రియల్ ఎస్టేట్ డెవెలపర్స్ రేపు అంటే ఫిబ్రవరి 1న  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ తమకు కష్టాలు ఎదురవుతున్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి , ఆర్ధిక భారం తగ్గించాలంటున్నారు.  వాళ్ల డిమాండ్లను ఒప్పుకుంటే డెవెలపర్స్ మీద ఆర్థి్ భారం తగ్గడమే కాదు, ఫ్లాట్స్ కొనేవాళ్ల మీద భారం తగ్గుతుంది.  ఎక్కువ మంది ఫ్లాట్స్ కొంటారు. నిర్మాణాలు ఎక్కువవుతాయి. ఉపాధి పెరుగుతంది. ప్రభుత్వాదాయం పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దేశంలో ఉపాధికి సంబంధించి నిర్మాణ రంగమే కీలమయింది. వ్యవసాయం స్థానాన్ని నిర్మాణ రంగంనెమ్మది నెమ్మదిగాత ఆక్రమిస్తూ ఉంది.

ప్రభుత్వం పిండుకునే ధోరణి మానేస్తే డెవెలపర్స్ హ్యాపీగా ఉంటారు.ఫ్లాట్లు కొనాలనుకునే వారు హ్యాపీగా ఉంటారు. ఫ్టాట్ల్ రెేట్లు తగ్గాలంటే ఈ చర్యలు తీసుకోవాలి:

  1. నిర్మాణ రంగాన్నిఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ ఇండస్ట్రీగా గుర్తించాలి. దీనితో డవెలపర్స్ తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఫలితంగా ఇపుడు భారతీయ నిర్మాణ రంగానికి శాపంగా మారిన అసంపూర్ణ ప్రాజక్టుల రోగం కొంతవరకు నయమవుతుంది. కోవిడ్ తో దెబ్బతిన్న ఈ రంగం త్వరగా కోలుకునేందుకు ఇది సాయపడుతుంది. ఇపుడు కేవలం ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్ మెంట్ కి మాత్రమే ఈ స్టేటస్ ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టర్ కు లేదు.
  2. జిఎస్ టి భారం తగ్తించాలి. ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ (ITC)ని పునరుద్ధరించాలి. దీనితో కనస్ట్రక్షన్ కాస్టు తగ్గుతుంది. అపుడు ప్రాపర్టీ ధర కూడా తగ్గుతుంది. గతంలో ఐటిసి ఉండింది. దీనిని ఉపసంహరించుకున్నారు. దీనిని పునరుద్ధరిస్తే, ప్రాపర్టీ ధరలు అదుపులో ఉంటాయని డెవెలపర్స్ వాదిస్తున్నారు.
  3. హౌసింగ్ సెక్టర్ లో   అండర్ కన్ స్ట్రక్షన్ ప్రాపర్టీస్ మీద జిఎస్ టి రద్దు చేయాలి.
  4. అఫర్డబుల్ హౌసింగ్  సెక్టర్ లో వాడే బిల్డింగ్ మెటీరియల్స్ మీద ఇపుడున్న జిఎస్ టి 50 శాతం తగ్గించాలి. జిఎస్ టి వ్యవహారాలు చూసేది ఆర్థిక మంత్రి కాదు. జిఎస్ టి కౌన్సిల్. అందువల్ల బడ్జెట్లో జిఎస్ లి సంస్కరణల ప్రతిపాదన ఆశించలేం.
  5. స్టాంప్ డ్యూటీ తగ్గింపు. నిజానికి కొనుగోలు దారులు ఇపుడు రెండు రకాల టాక్స్ కడుతున్నారు. అవి 1. జిఎస్ టి, 2. స్టాంప్ డ్యూటీ.  దీనితో ప్రాపర్టీ ధర పెరుగుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఆగస్టు 2020 నుంచి డిసెంబర్ 31, 2020 స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇలా దేశమంతా కూడా స్టాంపు డ్యూటీని తగ్గించాలి, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో రియల్ ఎస్టేస్ మార్కెట్ చాలా పుంజుకుంది. సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఇతర రాష్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులంతా కోరుతున్నారు.
  6. స్టాంపు డ్యూటీని కూడా జిఎస్ టి లోనే కలిపేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఇది ఫ్టాట్స్ కొనుగోలు చేసే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నది వారి వాదన.
  7. నత్తనడక నడుస్తున్న ప్రాజక్టులను ఆదుకునేందుకు రు.25 వేల కోట్ల ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (AIF)ని ఏర్పాటు చేసింది. దీనిని అమలుచేయడంలో ఆశించినంత వేగం లేదు. అందువల్ల డెవెలపపర్స్ బ్యాంకుల నుంచి ఫండింగ్ పొందేందుకు ఏర్పాటు కల్పించాలి.
  8. రియల్ ఎస్టేట్ ప్రాజక్టులకు సింగిల్ విండో క్లియరెన్స్ ఏర్పాటు చేయాలి. చాలా డిపార్ట్ మెంటులలో  ప్రాజక్టు క్లియరెన్స్ ఆలస్యం  అవుతున్నందున  క్లియరెన్స్ కు సంబంధించి అథారిటీస్ ని మొత్తంగా రేరా (RERA)పరిధిలోకి తీసుకురావాలి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ డిమాండ్లలో ఎన్నింటికి  సానుకూలంగా స్పందిస్తారో రేపు తెలుస్తుంది.  ఆమె రేపు ఉదయం పదకొండు గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఫ్లాట్ లు కొనాలనుకుంటున్న వాళంతా ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *