దేశంలో అన్ని జిల్లాల కంటే వరంగల్ జిల్లాలోనే అంధులు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ గణాంక వివరాలు చెబుతున్నాయని, ఇది కొంత వరకు నిజమేనని ల్లా మహిళా శిశు ,వికలాంగుల సంక్షేమ అధికారి శారద వెల్లడించారు. ఈ కారణంతో అందువల్ల జిల్లాలో అంధులకోసం ఒక పాఠశాల, వసతి గృహం అవసరమని, దీనికోసం ప్రతిపాదనలు పంపిస్తున్నామని ఆమె వెల్లడించారు.
ఈ రోజు ఆమె లూయీ బెయిలీ 212 వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. మొదట లూయి బ్రెయిలీ చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించి నోటిఫికేషన్ జారీ చేస్తామని సభా ముఖంగా ప్రకటించారు.
తెలంగాణ అంధ నిరుద్యోగుల జిల్లా అధ్యక్షులు మహేందర్ అధ్యక్షతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి అంధ ఉద్యోగుల సంఘ నాయకులు వైయెన్నార్ కృష్ణ,నగేష్ ,కుంటరాజు,రాజేందర్ ,అంధ నిరుద్యోగ సంఘ నాయకులు నర్శింహ ,మహేందర్ ,వి-జేఏసీ జిల్లా కన్వీనర్ నల్లెల్ల రాజయ్య,దివ్యాంగుల జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు భీమవరపు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.