ఒక నెల కిందట హైదరాబాద్ లోని ఏలియన్ స్పేష్ స్టేషన్ అనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కు వ్యతిరేకంగా వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పి, ఫ్లాట్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కారణం ఫ్లాట్ బుక్ చేసుకుని పదేళ్లయినా ఈ సంస్థ నిర్మాణం పూర్తి చేయలే పోయింది. సొంత ఇల్లు గురించి కలలు కంటున్న వాళ్లు, ఏలియన్ స్పేష్ స్టేషన్ 2010లో ఇచ్చిన గాలిమేడల ప్రకటనలు చూసి లక్షల డిపాజిట్లు చెల్లించి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు.
పదేళ్లయినా గాలిలో మేడలు లేయలేదు. వీళ్ల కలలు మేడలు కూలిపోయాయి. డిపాజిట్ చేసిన వారికి డబ్బు వాపస్ ఇవ్వకుండా సతాయించడం మొదలుపెట్టింది. దీనితో చెప్పినట్లు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వలేదని, డిపాజిట్ డబ్బు వాపసు ఇవ్వడం లేదని చెబుతూ ఒక బాధితుడు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం (Telangana State Consumer Disputes Redressal Forum)ను ఆశ్రయించాడు.
ఈ కేసు గురించి విన్న తర్వాత ఫోరం నెల కిందట 2020 డిసెంబర్ 26న తీర్పు చెబుతూ వినియోగదారునికి రు. 30 లక్షల రుపాయలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇలా 2013 లో గాని, 2013 కంటే ముందు గాని రియల్ ఎస్టేట్ ప్రాజక్టును ప్రారంభించి దానిని ఇప్పటికీ పూర్తి చేయకపోతే దానిని స్టక్ లేదా డిలేయ్డ్ (Stuck Project or Delayed Housing Project) ప్రాజక్టు అంటారు.
ఏలియన్ స్పేస్ స్టేషన్ వంటి అనుభవాలున్నా, రియల్ ఎస్టేటే ప్రాజక్టులను పూర్తిచేయడంలో ఇండియా లో రెండో బెస్ట్ సిటి హైదరాబాద్. మొదటిది చెన్నై.
2019 నాటికి దేశంలో ఏడు ప్రధాన నగరాలలో (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొలోకతా, ఎంఎంఆర్, ఎన్ సిఆర్, పుణే) 1322 ప్రాజక్టులు ఇలా ఆగిపోయాయి. ఇవన్నీ 2013లోనో, అంతకు ముందో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజక్టులలో ఉన్న ఫ్లాట్స్ 5.76లక్షలు. 2020 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య1132 ప్రాజక్టులకు తగ్గింది. కంప్లీట్ కాకుండా ఇరుక్కుపోయినా ప్లాట్స్ 5.02 లక్షలు.
ఇలా పూర్తికాకుండా మూలుగున్న ప్రాజక్టుల మొత్తం కాస్టు ఎంతో తెలుసా? 4.07 లక్షల కోట్లు.
ఇలా పూర్తికాకుండా మూలుగుతున్నపాజక్టులలో 74శాతం ఎన్ సిఆర్ (NCR National Capital Region), ఎంఎంఆర్ (Mumbai Metropolitan Region)లోనే ఉన్నాయి.దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో ఇలా స్టక్ అయిన ప్రాజక్టులు కేవలం 8 శాతమే.
అన్ని నగరాలకంటే, చెన్నై నగరంలో ఇలాంటి ప్రాజక్టులు బాగా తక్కువ. తమిళనాడు రాజధాని నగరంలో కేవలం 12 ప్రాజక్టులు మాత్రమే పూర్తికాకుండా మూలుగుతున్నాయి. ఇందులో ఇరుక్కుపోయిన ఫ్లాట్ల్స్ కేవలం 5940 మాత్రమే.
అయితే విశేషమేమిటంటే, కోవిడ కారణంగా ఆన్ సైట్ (on-site) పనుల మీద నిషేధం ఉన్నా 2020 చివరికల్లా 190 ప్రాజక్టులు పూర్తయ్యాయి. దీనివల్ల 73560 ప్లాట్ల నిర్మాణం పూర్తయిందని ఎనరాక్ (Anarock)స్టడీ వెల్లడించింది. అయితే, పూర్తయిన ప్రాజక్టులలో 84 ప్రాజక్టు ముంబై ప్రాంతానివే.వీటి వల్ల ముంబైలో 29,750 ఫ్లాట్లు నిర్మాణమయ్యాయి. ముంబై లో పూర్తికాకుండా మూలుగుతున్న ప్రాజక్టులింకా చాలా ఉన్నాయి.. మొత్తంగా 1.80 లక్ష ఫ్లాట్స్ స్టక్ అయిఉన్నాయి. వీటి విలువ రు. 2.02 లక్ష కోట్లు
ఇండియాలో చేపట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజక్టులు పూర్తికాక పోవడమనేది ఈ రంగాని కొక శాపమని ఎనరాక్ ప్రాపర్టీ కన్సల్టాంట్స్ ఛెయిర్మన్ అనుజ్ పూరీ అన్నారు. రేరా (RERA)చట్టం వచ్చినా పరిస్థితి మెరుగుపడలేదు. నిధుల కొరత ఈ రంగాన్ని బాగా పడిస్తున్నందున భారత ప్రభుత్వం 2019 చివర్లో రు. 25వేల కోట్ల తో ఆల్టర్ నేట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (AIF)ని ఏర్పాటు చేసింది. స్టక్ ప్రాజక్టులు పూర్తయేందుకు ఇది దోహదపడుతుందని పూరీ లాంటి వాళ్లు ఆశిస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆరు (6) 2020 లో పూర్తి అయిన ప్రాజక్లులు పూర్తి అయ్యాయి. ఇందులో 2380 ప్లాట్స్ ఉన్నాయి. నగరంలో మొత్తం 16 ప్రాజక్టులు పూర్తికాక పక్కన బడి మూలుగుతున్నాయి.పైన పేర్కొన్న ఏలియన్ స్టేషన్ ఈ బాపతుదే.
ఈ పదహారు ప్రాజక్టులలో 6520 ప్లాట్స్ ఇరుక్కుపోయి ఉన్నాయి. వీటి విలువ రు.4305 కోట్లు. 2019 చివరన 22 ప్రాజక్టులు స్టక్ అయి ఉండేవి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే, 2019లో తయారయిన యూనిట్లు 22,940 కాగా ఇందులో సేల్ అయినవి 16,400. సిటిలో మొత్తంగా 39,308 యూనిట్లు కొనేవాళ్లకోసం ఎదురు చూస్తున్నాయి. హైదరాబాద్ సగటున ప్రజాక్టు పూర్తయ్యేందుకు 29 నెలలు పడుతూ ఉంది.