వైఎస్ ను ప్రశంసించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

కడప జిల్లా ఒంటిమిట్ట లో బసచేసి స్వామివారి అభిషేకంలో పాల్గోనాలని వ్యక్తిగత కోరిక నెరవేరిందని  ఈ రోజు కోదండ రామస్వామి ఆలయం సందర్శించిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  ఆ కోరిక నేరవేరడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Nimmagadda Rameshkumar

ఈ సందర్భంగా ఆయన వివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిమ్మగడ్డ  ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా ఉన్నారు. అంటే వైెఎస్ ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చినట్లే లేక్క. నిజానికి ఆర్థిక శాఖ నుంచి రాజ్ భవన్ కి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పంపింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డియే.

ఈ విషయాలను గుర్తు చేస్తూ ” వైఎస్ హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశాను . అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్లాను  రాజ్ భవన్ ఆశిస్సులతో ఎన్నికల కమిషనర్ ని అయ్యాను.  దివంగత నేత వైఎస్ లో లౌకిక దృక్పథం ఉండేది. తనపై వైఎస్ ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు,’అని అన్నారు.

ఎన్నికల నిర్వహణ అడ్డుకోబోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసిన విషయం ప్రస్తావిస్తూ ఇటీవల జరిగిన కోన్ని పరిణామాల్లో నేనే ప్రత్యక్షంగా చూశాను, అయినా భయపడే ప్రసక్తే లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ హక్కు అని అంటూరాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతున్నదని, వ్యవస్థలను గౌరవించకుండా మా వాళ్లు మీ వాళ్లు అనడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల ఏకగ్రీవం ఎన్నికలలకోస జరుగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ  2006లో 36శాతమే ఏకగ్రీవమయ్యాయిని,  ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయని అయన చెప్కపారు.

బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదుని పార్టీలకు సూచించారు.

ఏకగ్రీవాలకు వత్తిడి చేసే వారిపై నేటి నుంచి షాడో టీమ్ ల ఏర్పాటు చేస్తాం. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్స్ ఏర్పాటు చేశాం,’అని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని కూడా ఆయన వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *