ప్రైవేటు స్కూళ్ల ఫీజులు 30 శాతం తగ్గించిన కర్నాటక

కరోనా పాండెమిక్ వల్ల కుటుంబాల ఆదాయం బాగా పడిపోవడంతో, రాష్ట్రంలో పాఠశాల పీజులను  కర్నాటక ప్రభుత్వం 30 శాతం తగ్గించింది.

కరోనాకు ముందు సంవత్సరం వసూలు చేసిన ఫీజులో కేవలం  70 శాతం మాత్రమే వసూలు చేయాలని  శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇది రాష్ట్రం లోని అన్ని ప్రయివేటు స్కూళ్లకు వర్తిస్తుంది. సిబిఎస్ ఇ (CBSE), ఐసి ఎస్ ఇ (ICSE)లతో పాటు ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా ఈ ఆదేశాలని అమలు చేయాల్సిందేనని  ప్రభుత్వం పేర్కొంది.

ఈ నియమాలు అమలు చేసినట్లు నటిస్తూ ఇతర రూపాల్లో ఫీజులు వసూలు చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.

ప్రయివేటు స్కూళ్లన్నీ డెవెలప్ మెంట్ ఫీజు, ట్రాన్స్ పోర్టేషన్ ఫీజు, స్పెషల్ ఎమెనిటీస్ ఫీజుల, డొననేషన్ల  రూపంలో చాలా  ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఈ ఏడాది ఇలాంటి వేషాలు వేయవద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

ఒక వేళ ఇప్పటికే ఫీజలు వసూలు చేసి ఉంటే 30 శాతం ఫీజులను వెంటనే వాపసు ఇవ్వాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. కర్నాటక ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్  ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలుకు  హెచ్చరిక చేస్తూ ఈ 70 శాతం ఫీజులను కూడా  పేరెంట్స్ దగ్గిర నుంచి రెండు వాయిదాలలో వసూలు చేయాలని తెలిపారు.

1983 కర్నాటక ఎజుకేషన్ యాక్ట్ (Karnataka Education Act 1983) ,1897 ఎపిడెమిక్ యాక్ట్  ప్రకారం  పాఠశాలల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని, దీనిని కోర్టు లు కూడా ధృవీకరించాయని మంత్రి తెలిపారు.

ప్రయివేటు పాఠశాలలు రెగ్యులర్ క్లాసులు నడపనందున వాటి ఖర్చులు బాగా తగ్గాయి కాబట్టి  ఫీజులను తగ్గించవచ్చని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *