ఎకగ్రీవ ఎన్నికల కోసం భయపెడుతున్నారు: టిడిపి

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (టీడీపీ జాతీయ అధికారప్రతినిధి)

గత విడత ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాయుత ఘటలను చూస్తే, పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

నామినేషన్లు వేయడానికి వచ్చిన మహిళ లపై దాడులు, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, నామినేషన్ పత్రాలు చించేసి చితకబాదడం జరిగింది.

చిత్తూరు జిల్లాలో ఒకమహిళ నామినేషన్ పత్రాలను తన జాకెట్ లో దాచుకొ ని వెళితే, ఆమెపై కూడా దాడిచేశారు. చిత్తూరు జిల్లాలో వృద్ధురాలు అనికూడా చూడకుండా ఎగబడ్డారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటు గుంటూరుజిల్లా పల్నాడులో మహిళలపై అధికారపార్టీ వారు దాడి చేశారు.

నరేగా పనులకు సంబంధించిన నిధులు రూ.2,500 కోట్లను విడుదలచేయకుండా, నామినేషన్లు ఉపసంహరించుకునే లా ఒత్తిడిచేశారు. పెండింగ్ బిల్లులను సాకుగా చూపి, బెదిరించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామంటూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, వైసీపీవారే మద్యంసీసాలను టీడీపీ వారి ఇంట్లో పెట్టి, ప్రత్యర్థుల డిస్ క్వాలిఫై అయ్యేలా చేశారు. ఈ ఘటన తెనాలిలో జరిగింది. ఈ విధంగా అన్నిరకాలుగా దౌర్జన్యాలు, దాడులతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు.

సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ సలహాదారు

ఏకగ్రీవాలే లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ, ఆగని దౌర్జన్యాలు, గాయపడిన అభ్యర్థులు, అడుగడుగునా నామినేషన్ల అడ్డగింత పేరుతో పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఇవే  ముఖ్యమంత్రి ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న ఏకగ్రీవాలు.

వృద్ధులు, మహిళలపై దాడిచేయడం, నరేగా బిల్లులను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు దిగడం, నామినేషన్ పత్రాలు చించేయడం, ఇవే ఇప్పుడు సజ్జల చెబుతున్న, సంవత్సరం క్రితం వైసీపీ వారుచేసిన ఏకగ్రీవాలు.

అందుకే సజ్జల నేడు ఏకగ్రీవం అనగానే రాష్ట్ర ప్రజలంతా ఉలిక్కిపడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9,696 ఎంపీటీసీలుంటే, వాటిలో 2,362 ఎంపీటీసీలను బలవంతంగా ఏకగ్రీవం చేశారు. అందుకోసం ప్రతి జిల్లాకు రౌడీలను, అల్లరిమూకలను పంపించారు. మారణాయుధా లు సరఫరా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, ఇటువంటి కుట్రలు, కుతంత్రపు ఆలోచనలు చేసేది సజ్జల గారేకదా? ఆయన చేయించినంత బ్రహ్మండంగా బలవంతపు ఏకగ్రీవాలకు పథకరచన ఎవరూచేయలేరు. ఎంపీటీసీల్లో 24శాతం బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే, జడ్పీటీసీల్లో 19శాతం వరకు జరిగాయి.

కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో జడ్పీటీసీల్లో 76శాతంవరకు బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. ఎంతైనా సీఎం సొంత జిల్లా కదా… ఆ స్థాయిలో ఉంటుంది మరి. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్ష పాతంగాఎన్నిక జరిగి, ప్రజలకు ఓటేసే అవకాశం కనుక కల్పిస్తే, ప్రజల చేతిల్లో చీవాట్లు తప్పవని తెలిసే, నేడు సజ్జల పెద్దఎత్తున హింసాయుతంగా బలవంతపు ఏకగ్రీవాలకు తెరలేపుతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఓటమికి భయపడే ఈ విధమైన కుట్రపూరిత ఆలోచనలు వైసీపీ వారు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది.
జరగబోయే పర్యవసానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థులే బాధ్యులవుతారని చెప్పడంద్వారా సజ్జల ఎవరిని బెదిరిస్తున్నాడు. నేడు సజ్జల చేసినవ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించి చర్యలు తీసుకోవాలి. సంవత్సరం క్రితం ఏకగ్రీవాల పేరుతో అధికారపార్టీ వారు చేసిన హింసకు సంబంధించిన కథనాలు పత్రికల్లో వచ్చాయి. అందువల్లే ఆ ఏకగ్రీవాలను రద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరడం జరిగింది. అదలా ఉండగానే, నేడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే మాదిరి బలవంతంగా, హింసాయుతంగా ఏక గ్రీవాలకు సిద్ధమవుతున్నామని, మా దొడ్లలో,ఇళ్లల్లో మారణాయు ధాలను సిద్ధంచేస్తున్నామని చెప్పినట్లుగా నేడు సజ్జల మాట్లాడా డు. సజ్జల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని, పంచాయతీ ఎన్ని కల నిర్వహణకోసం కేంద్రబలగాలను పిలిపించి, వైసీపీ రౌడీమూకల అరాచకాలను, బాధ్యతలేకుండా వ్యవహరించే ప్రతి అదికారిని నిలువరించి, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం.

 

( కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 26-01-2021 నాటి విలేకరుల సమావేశం విశేషాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *