భారతదేశంలో మొదటి విడత లో కోవిడ్ మీద సాగుతున్న పోరాటంలో ముందున్న డాక్టర్లకు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు దేశంలో 1.6 మిలియన్ (16,13,667) మందికి 28613 సెంటర్ల నుంచి వ్యాక్సిన్ ఎక్కించారు. ఇండియాకు రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ ఉంది. అయితే సాధించింది 58 శాతమే. ముందు ముందు ఇది మెరుగుపడి, రోజుకు 2 లక్షల మందికి చేరినా, దేశంలో ఉన్న 30 మిలియన్ల హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు 5 నెలలు పడుతుంది. తర్వాత రెండో విడత 20 మిలియన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ పైన 270 మిలియన్ల వయోవృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలి. వీళ్లందరికి రెండు డోసుల ఇవ్వడానికి కనీసం 36 నెలలు (3 సం.) పడుతుందని అశోకా యూనివర్శిటీ వైరాలజిస్టు షాహీద్ జమీల్ చెబుతున్నారు.ఇక దేశమంతా ఇవ్వాలంటే…