గృహిణుల పక్షాన నిలబడ్డ బంగారు వ్యాపారస్థులు…

బంగారు డిమాండ్ పెరగాలంటే గృహిణులు స్వచ్ఛందంగా, ఎలాంటి ఆంక్షలు లేకుండా బంగారు కొనేందుకు అవకాశమీయాలని ముంబై జ్యుయలర్స్ అసోసియేషన్  నీతి ఆయోగ్ కు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి  చేసింది.

భారతదేశం లో గృహిణులు తమ సేవింగ్స్ నుంచి కొద్దిగా కొద్దిగా బంగారు కొంటుంటారని, ఇలాంటపుడు బంగారు కొనుగోలు మీద రెండు లక్షల ఆంక్ష విధించడం సబబు కాదని వారు పేర్కొన్నారు.

ఇపుడున్న నియమాల ప్రకారం  రెండులక్షల రుపాయల విలువయిన  బంగారాన్ని మాత్రమే ప్యాన్ కార్డు లేకుండా కొనవచ్చు.  ప్రస్తుతమున్న మార్కెట్ ధరల ప్రకారం రెండు లక్షల రుపాయలకు వచ్చేది కేవలం 30 గ్రాములకు మించదు. అందువల్ల గృహిణులు పెద్ద ఎత్తన బంగారు కొనుగోలు చేయాలంటే ప్యాన్ నంబర్ లేకుండా బంగారు కొనే పరిమితిని రెండులక్షల రుపాయల నుంచి పది లక్షలకు పెంచాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ఇదే విధంగా ఇపుడు బంగారు దిగుమతుల మీద  12.5 శాతం సుంకం విధిస్తున్నారు, దీనిని 4 నుంచి 6 శాతానికి తగ్గించాలని కూడా ఈ అసోసియేషన్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసింది.

ఇది ఇలా ఉంటే, శుక్రవారం నాడు   పది గ్రాముల బంగారు ధర రు. 519 పడిపోయి  రు. 49,140 అయింది. అమెరికా ట్రెజరీ రాబడి పెరగడం,  నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు. మొత్తంగా ఈ వారం బంగారు ధర రు.187 అంటే 0.38 శాతం పడింది.  22 క్యారట్ల బంగారం ధర ముంబై మార్కెట్లో  రు. 45,012కు దిగివచ్చింది. ఈ ధరలకు జిఎస్ టి 3 శాతం అదనం.

ఇది ఇలా ఉంటే బంగారు ధరలు ఏప్రిల్ లోపు బాగా పెరుగుతాయని, పది గ్రాముల 24 క్యారట్ల బంగారు ధర రు. 60వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *