లాక్ డౌన్ లో కుర్రాళ్లంతా ఎలా పండగ చేసుకున్నారో తెలుసా?

గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ దాకా భారత దేశం లాక్ డౌన్ లో  ఉంది.

ఇళ్లకు తలుపులేసుకుని జనమంతా గృహనిర్బంధంలోకి వెళ్లిపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. మార్కెట్లు బంద్, హోటళ్లు, రెస్టరాంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ బండ్లు,కూరగాయల మండీలు బంద్. దేశమంతా కర్ఫ్యూ. చాలా చోట్ల తిండి కరువైంది. ఉద్యోగాలు, కూలీపనులు మాయమయ్యాయి.కోట్లాది మంది కూలీలు పొట్టచేత పట్టుకుని వందల మైళ్లు నడుచుకుంటూ సొంతవూర్లకు పరుగుపెట్టారు.ఇలాంటి దారుణ పరిస్థితి ఒక వైపు.

మరొక వైపు కోవిడ్ షాక్ విషాదం. కరోనా ఎవరిని బడితె వారిని కాటేస్తూ ఉంది. వేల సంఖ్యలో ఆసుపత్రుల పాలువుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఖరీదైనా మందు ల్లేకపోయినా ఆసుపత్రలు కరోనా ట్రీట్  మెంట్ పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేసేశాయి. గంట గంటకు ప్రజలు కరోనా మీటర్ చెక్ చేసుకుంటూ ఏవూర్లో ఎంతమంది కరోనా సోకింది, ఎంత మంది చనిపోయారు, తమ వూర్లో కరోనా ఎలా ఉంది, అని ఆత్రంగా జనం ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిలో సంతోషం పట్టలేక చిందులేసింది, ఒక్కటే స్టాక్ మార్కెట్.

తలుపులు కిటికీలు వేసుకుని కోట్లాది మంది మధ్యతరగతి భారతీయులు చేసిందేమిటో తెలుసా, తమ దగ్గిరేవయినా డబ్బులుంటే వాటిని స్టాక్ మార్కెట్ లోకి మళ్లించడమే.

కరోనా వల్ల డబ్బు గురించి ప్రజల్లో బాగా  జ్ఞానోదయం అయింది. ఎపుడైనా సరే కరోనా వంటి విషపు క్రిమి దాడి చేయవచ్చు, ఆసుపత్రులు అపుడు లక్షలకు లక్షలు వసూలు చేస్తాయని కనుగొన్నారు. దానికి తోడు, బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ లో ఉన్న డబ్బు వల్ల వడ్డీ రాబడి పడిపోయింది. బంగారు అమ్మెందుకు, కొనేందుకు మార్కెట్లు మూతబడ్డాయి. బంగారు ధరించేందుకు, ఆపత్సమయంలో అమ్ముడుపోయి ఆదుకునేందుకు పనికిరాకుండా పోయింది.

ఈ సమయంలో తమ దగ్గిర ఉన్న సేవింగ్స్  ని తీరుబడిగా అంతా షేర్ మార్కెట్ వైపు మళ్లించారు. షేర్ మార్కెట్ లో నుంచి డబ్బు తీసుకోవడం ఈజి. ఈ ఆలోచనతో హఠాత్తుగా  షేర్ మార్కెట్ లోకి డబ్బు వెల్లువలా ప్రవహించడం మొదలయింది.

షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. పనిచేయకపోయినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థంభించినా కొన్ని కంపెనీల షేర్లు మార్చి 2020- జనవరి 2021 మధ్య రెట్టింపయ్యాయి. దీనికి కారణం, షేర్ మార్కెట్ బుల్లిష్ అయింది.  రిటైల్ షేర్ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. ఇంతవరకు సేవింగ్ అకౌంట్లకు పరిమితమయిన జనమంతా కరోనా కాలంలో  డిమ్యాట్ అకౌంట్లు పెద్ద ఎత్తున తెరిచారు. కరోనా వల్ల కుటుంబాల ఆదాయం కొంత తగ్గినా ఖర్చులు కూడా తగ్గడంతో ప్రతి కుటుంబం సగటు 20 వేల దాకా ఆదా చేసింది. ఈ డబ్బంతా షేర్ మార్కెట్లోకి దుమికింది. ఇవిగో విశేషాలు:

2009 డిసెంబర్- 2019 డిసెంబర్ మధ్య సిడిఎస్ ఎల్ (CDSL), ఎన్ ఎస్ డిఎల్  (NSDL) ఓపెన్ చేసిన కొంత  డిమ్యాట్ అకౌంట్లు కేవలం 2.1 కోట్లు.

దీనితో 2019 డిసెంబర్ నాటికి దేశంలో ఉన్న  మొత్తం డిమ్యాట్ అకౌంట్లు 3.93 కోట్లయ్యాయి.

డిసెంబర్ 2020 నాటికి అంటే ఒక ఏడాదిలోొ దేశంలో డిమ్యాట్ అకౌంట్లు 4.98 కోట్లకు చేరాయి. డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 మధ్య 1.5 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు వచ్చాయి. ఈ కాలమంతా కరోనా లాక్ డౌన్ కాలమే.

ప్రతినెలా  8 లక్షల డిమ్యాట్ అకౌంట్లు తెరిచారన్న మాట. లాక్ డౌన్ మొదలయ్యాక సగటున  నెలసరి ఓపెన్ అయిన డిమ్యాట్  అకౌంట్లు10 లక్షలు.

కారణాలు: ఆర్థిక సంక్షోభం కళ్లముందు కదిలాడింది. వైద్యం ఖర్చులుభారం కావచ్చన్న భయం మొదలయింది. చేసేందుకు పని లేదు. విలాసాలు విందులు ప్రయణాలు తగ్గిపోయి బాగా డబ్బు ఆదా అయింది. బ్యాంక్ లు ఎఫ్ డి రేట్లను 7-9 శాతం నుంచి 4- 5 శాతానికి తగ్గించాయి. ఇంట్లో బంగారం దండిగా ఉన్నా మార్కెట్ మూత పడి ఉండటతో లిక్విడిటీ వ్యాల్యూ పడిపోయింది. దీనితో  నాలుగు డబ్బులు వెనకేసుకున్న మధ్య తరగతి యువకులంతా షేర్ మార్కెట్లో  తమ డబ్బునంతా గుమ్మరించారు. అందుకే డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 దాకా షేర్ మార్కెట్ రాక్ డ్యాన్స్ చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *