సెక్యులరిజం పై పవన్ కల్యాణ్ నిప్పులు

భారతదేశంలో సెక్యులరిజం తీరు పట్ల  జనసేన నేత పవన్ కల్యాణ్  అసంతృప్తి, అసహనం  వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే మౌనంగా ఉండటం సెక్యులరిజమా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అనే పదం అర్థం మతాలను సమానంగా చూడటం అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 142 దేవాలయాలపై దాడులు జరిగితే, సెక్యులరిస్టు మాట్లాడకుండా ఉండటం పట్ల ఆయన అభ్యంతరం చెప్పారు. ఇన్ని దేవాలయాల మీద దాడి జరిగితే  రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని కూడా ఆయన ప్రశ్నించారు.

‘‘ఇలాంటి దాడులు చర్చి మీద  మసీదుమీద దాడి జరిగితే అంతా గగ్గోలు పెట్టేవారు, దురదృష్టం ఇపుడలా జరగడం లేదు.   హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే కామ్ గా ఉండాలి. వేరే మతాల మీద దాడి జరిగితే ఖండించాలి. ఇదా సెక్యులరిం’’  అని  పవన్ అన్నారు.

అన్ని దేవాలయాలమీద దాడులను సమానంగా చూడటమే సెక్యులరిజం.

రామతీర్థం ప్రస్తావిస్తూ, రామతీర్థం మీద ప్రజలకు పిలుపునీయడం సున్నితమయిన విషయం.  ఈ విషయంలో బాధ్యతాయుతంగా  ఉంటాను. మేం వెళ్తే  భావోద్వేగాలు వచ్చి చాలా మంది అమాయకులు బలయిపోతారు. అందుకే నిగ్రహంతో ఉన్నాను, అని పవన్ అన్నారు.

‘‘హిందువుల ఆలయాల పట్ల ఒకలాగా,  ఇతర మతాల పట్ల ఒకలా స్పందించటం తప్పు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజం,” అయన సెక్యులరిజానికి నిర్వచనం చెప్పారు.

“సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? ఏ మాత్రం బాధ్యత లేకుండా  వైసిపి ప్రభుత్వం  వ్యవహరిస్తున్నది. అంతర్వేది లో ఒక  రథాన్ని కాల్చేస్తే,   ఇంకొక రథం చేయిస్తామంటారా? చాలా నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు. మసీదు మీదో చర్చి మీద జరిగితే ఇలా గే మాట్లాడగలరా? ఇది చాలా బాధ కలిగిస్తూ ఉంది.

మతమంటే మానవత్వం అని జనసేన నమ్ముతుంది,’ ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాతో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం నిత్య కృత్యమయింది. ఇలాంటి దారుణాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం.,’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరు పట్ల  అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ఆలయ దాడులను వైసిపి చేసిందని మేంఅనడం లేదు, కానీ మీ ఉదాసీనత వల్ల ఇదంతా జరగుతు ఊందని మాత్రమే అంటున్నానని పవన్ అన్నారు.

‘ధర్మం భ్రష్టు పడతున్నది, ధర్మాన్ని కాపాడాండి,అని చాలా మంది ప్రజలు నా దగ్గిరకు వచ్చి  కోరుతున్నారు. ఎండో మెంట్స్ బోర్డు సౌత్ లోనే ఎందుకుంది. నార్త ఆర్కాట్ నవాబు  కొద్ది గా కప్పం తీసుకుని గుడిని వదిలేశాడు. తర్వాత ఈస్టిండియా కంపెనీ వచ్చి టెంపుల్  ఆదాయం గ్రహించి గుడిలోకి ప్రభుత్వాన్ని నడిపించింది. ఇలా ప్రభుత్వం జోక్యం తిరుమల గుడిలో మొదలయింది. ఇపుడు పొలిటికల్ గ్రూపులన్నీ ఎండో మెంట్ బోర్డులో చొరబడి, నిధులను రాజకీయావసరాలకు వాడుకోవడం జరగుతూ ఉంది. ఇది వైపిపియే చేస్తున్నదని నేననడం లేదు. ఎప్పటినుంచో జరగుతూ ఉంది. రాష్ట్రంలో  తిరుమలతో సహా 12 ప్రముఖ టెంపుల్ కమిటీలు పని చేస్తున్న తీరును గమనించేందుకు ఒక షాడో కమిటి ఏర్పాటు చేస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా ఈ పనిచేస్తున్నాం’ అని పవన్ చెప్పారు.

దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని చెబుతూ ఆంధ్రప్రదేశ్ లో  శాంతి భద్రతలు క్షీణించాయని శాంతి భద్రతలను కాపాడాలని కోరితే వారిపైనా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.

‘150 మంది ఎమ్మెల్యేలతో  ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే మంచి ప్రభుత్వం రావాలి. ఉపాధి పెరగాలి. ఈ విషయాన్ని రాయలసీమలో నాకు చెబుతున్నారు. యువకులు ఉపాధి లేక నిస్సహాయతతో ఉన్నారు. నిరుద్యోగలతో కొన్ని కమిటీలువేసి ఎలాంటి ఉపాధి కావాలనే దాని మీద చర్చించి ప్రాంతాల వారిగా ఒక ప్రణాళిక రూపొందిస్తాం,’ అని పవన్ చెప్పారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *