నారాయణ, చైతన్య కాలేజీల్లో అకస్మిక తనిఖీలు, శానిటైజర్లు కూడా లేవు…

ఆంధ్ర ప్రదేశ్ లో  నారాయణ, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేసినా ప్రస్తుత కరోనా పాండెమిక్ వాతావరణంలో కనీసం భద్రతాచర్యలు తీసుకోకుండా ఉండటం బయటపడింది.

అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తల్లితండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో  రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్‌ అకస్మిక  దాడులు నిర్వహించింది.

ఇందులో  నారాయణ,చైతన్య కాలేజీల నిర్వాకం బయటపడింది. చాలా కళాశాలలో భద్రత కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కమిషన్‌కు అధికారులు  నాలుగు బృందాలుగా ఏర్పడి తనీఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో ప్రొఫెసర్‌ నారాయణరెడ్డి, డాక్టర్‌ ఈశ్వరయ్య సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు..

ఈ సంక్రాంతికి తమ నుంచి రు. 60 వేల నుంచి రు. 70 వేల వరకు ఫీజులు కట్టించుకున్నారని విద్యార్థులు అధికారులకు తెలిపారు. పేరుకు కార్పరేట్ కళాశాలలే అయినా  టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్‌రూమ్‌ కేటాయించారని తెలిపారు.

ఇంటర్‌ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని  విద్యార్థులు చెప్పారు.  ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని తనిఖీల అనంతరం అధికారులు తెలిపారు.

భారీగాఫీజులు వసూలు చేస్తున్నా, కళాశాలల్లో  తాగునీరు, బాత్‌రూమ్‌ లలో కొళాయిలు లేకపోవటం చేసి కమిషన్‌ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ  యాజమాన్యాల అధిక ఫీజులు వసూలుచేయడమే కాదు,  జీవో 51ని కూడా అమలు చేయడం లేదన వారు తెలిపారు.

నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్‌ సభ్యులు వెల్లడించారు.

అధికారులు వెల్లడించిన మరిన్ని విశేషాలు:

కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదు, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదు.

 

మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

గతేడాది ట్యూషన్‌ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *