ఆంధ్ర పంచాయతీ ఎన్నికల మీద కొద్దిసేపట్లో హైకోర్టు తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం మీద కొద్ది సేపట్లో  హైకోర్టు తీర్పు వెలువడనుంది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8 వ తేదీన ఆంధ్రప్రదేశ్  ఎన్నికల సంఘం (ఎపి ఎస్ ఇ సి) ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ  ఈ నెల 11 న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో , అందునా వ్యాక్సినేషన్ కార్యక్రమవ అమలు చేయడంలో రాష్ట్ర యంత్రాంగం నిండా మునిగి ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని, నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.మరొక వైపు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగల సంఘాలు ఎన్నికలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎస్ ఇసి నోటిఫికేషన్ ను ప్రజారోగ్యం రీత్యా సస్పెండ్ చేసింది.

అయతే, ఆ ఉత్తర్వులను  రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ ) సవాల్ చేసింది. ఈ అప్పీల్ డివిజన్ బెంచ్ ముందకు వచ్చింది.

చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. దీని మీద మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. హైకోర్టు  తీర్పువాయిదా వేసింది.

ఈ రోజు తీర్పు వెలువడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *