ప్రముఖ విప్లవ కవి వరవరరావు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది.ఈ పిటిషన్ ముంబై హైకోర్టు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దశలో కూడా ఆయనను విడుదల చేయకుండా ఎన్ ఐ ఎ వ్యతిరేకిస్తూ ఉంది. అయితే, కుటుంబ సభ్యలు బెయిలు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు
ఇవాళ విప్లవ కవి తరఫున న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ఒక గంటా నలభై నిమిషాలపాటు అద్భుతమైన వాదనలు వినిపించారు.
అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ షిండే, జస్టిస్ పిటాలే లు విచారణను రేపటికి వాయిదా వేశారు.
రేపు వరవరరావు తరఫున మరొక సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తారు. అనంతరం ప్రాసిక్యూషన్ వాదనలు కూడ విన్నాక కోర్టు తీర్జు ఇవ్వచ్చు. తీర్పు రేపు గాని, ఇంకో వాయిదాలో గాని తీర్పు రావచ్చు.