1986లో రాయలసీమ, తెలంగాణలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు, పంటలు లేక, నీళ్లు లేక ఇక్కడి ఈ ప్రాంతాలలో పశుగ్రాసం కొరత తీవ్రమయింది. మూగజీవాలకు పశుగ్రాసం అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దృష్టికి వచ్చింది. పశుగ్రాసం కోస్తా ప్రాంతంలో అందుబాటులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామారావు కోస్తా రైతులకు పశుగ్రాసం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి ఎన్నటికీ మరువలేనిది. ఈ రోజు ఆయన వర్ధంతి.