వీరవనిత: తెలంగాణలో ఏకైక కల్లుగీతమ్మ…పుర్రాసావిత్రి

పుర్రా సావిత్రిది చాలా ఇన్ స్పైరింగ్ స్టోరీ. అంత ఈజీగా కడతేరని కష్టాలున్నా మంచిరోజులొస్తాయనే ఆపారమయిన నమ్మకం ఆమె ముఖం మీద మెరుస్తూ ఉంటుంది.

ఆమె వయసు 25 సంవత్సరాలు. చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అయిదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించాలి. కుటుంబ భారం ఆమె మీదేపడింది.

అయితే, ఆమె క్రుంగిపోలేదు. సాహసంతో ముందుకుపోయేందుకే నిర్ణయించుకుంది. కులవృత్తినేఎంచుకుంది.అది మగవాళ్లు చేసే పనే అయినా జంకలేదు.  భర్త చేస్తూ ఉండిన  కల్లు గీత పనినే తాను ఎంచుకుంది. తాటి చెట్లెక్కి కల్లు గీయడం మొదలుపెట్టింది. బంధువులు, ఇరుగుపొరుగు బాగా నిరుత్సాహపరించారు. ఆమె నిరుత్సాహపడలేదు. ముందుకెళ్లింది. దాంతో కొంతమంది ఆమె తో మాట్లడటమే మానేశారు. అయితే, ఇవేవీ ఆమె దృఢ నిశ్చయాన్ని దెబ్బతీయలేదు. ఎందుకుంటే, బతుకామెది, భారం అమెది, ఇలాంటి వాటికి లోనయితే, బతకు ముందుకు సాగెదెట్లా, భారం మోసేదెట్లా?

ఇపుడు సావిత్రి సునాయాసంగా తాటి చెట్టెక్కుతుంది. రోజు పది చెట్లెక్కి కలు గీసుకొచ్చి, రోడ్డు పక్కన కూర్చుని అమ్ముతుంది. రోజు నాలుగు వందల దాకా గిడుతుంది.  తెలంగాణా ఎక్సైజ్ శాఖ వాళ్లు   గీసే వాడికి చెట్టు (Tree For Tapper TFT) కింది లైసెన్స్ ఇచ్చారు. ఆమె రోజు 30 చెట్లెక్క కల్లు గీయవచ్చు.

పుర్రా సావిత్రిది మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మండలం రేగోడ్ గ్రామం. వూరికి ఎనిమిది కిలో మీటర్ల దూరానా తాటి వనం ఉంది. అక్కడి రోజూపొద్దు పొడవక ముందే  నడుచుకుంటూ వెళ్లి, 50 లీటర్ల కల్లు గీసుకుని వస్తుంది. దానిని రోడ్లుపక్కన కూర్చుని దారిని పోయే వారికి ఫ్రెస్ గా విక్రయిస్తుంది.ఇలా వచ్చిందే ఆమె రాబడి.

కూతురు ఆరోగ్యం బాగుండదు. మామ మంచాన పడ్డారు. ఈ ఖర్చే ఆమెకు నెలకు రు. 6000 దాకా వస్తుంది.  కల్లుగీసి అమ్మి, ఈ ఖర్చులను లెక్కచేయకుండా ఆమె కుటుంబాన్ని పోషిస్తూ ఉంది.  ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కొంత ఆసరా.

మొదట్లో చెట్టెక్కడం కష్టంగా ఉండేది. నడుమునొప్పి వచ్చేంది. ఇపుడదేమీ లేదు. సునాయాసంగా ఎక్కగలను అని  గర్వంగా చెబుతుంది సావిత్రి.  ఇంటి నిండా కష్టాలు తిష్ట వేసి ఉన్నా మంచి రోజులొస్తాయని సావిత్రికి నమ్మకం. ఆ నమ్మకమే ఆమెను నడిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *